వనపర్తి, మార్చి 1(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు, మరికొన్ని కొత్త పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసేందు కు ఆదివారం వనపర్తికి రానున్నారు. రెండు, మూడు నెలల నుంచి ఇప్పుడూ అప్పుడంటూ సీఎం ప్రోగ్రాంను చర్చిస్తు న్నా.. వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి పర్యటనకు ము హూర్తం ఫిక్స్ చేయడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ మేరకు ప్రచారంలో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను ఒకసారి, రూ.700 కోట్ల పనులంటూ మరోసారి ప్రచారా లు జరుగుతూ ఉన్నాయి. చివరకు అభివృద్ధి పనుల జాబితాను నిశితంగా పరిశీలిస్తే.. అందులో గతంలో ఉన్నవి కూ డా సీఎం ద్వారా శంకుస్థాపన చేయించేందుకు పురమాయించారన్న విమర్శ లు వెలువడుతున్నాయి.
ఇందులో ప్ర ధానంగా జీజీహెచ్(గవర్నమెంట్ జనర ల్ ఆసుపత్రి)కి కోసం గత ప్రభుత్వంలో నే జీవో 92 ద్వారా మెడికల్ కళాశాల, హాస్టల్స్ భవనాలు, 500 పడకల దవాఖాన నిర్మాణానికి రూ.510 కోట్లు మం జూరై టెండర్లు కూడా జరిగిన సంగతి వి ధితమే. వీటిలో మెడికల్ కళాశాల, హా స్టళ్ల భవనాల నిర్మాణాలు కూడా కొలిక్కి వచ్చాయి. ఇక మిగిలింది దవాఖాన ని ర్మాణమే. ఆ పనులకు ఇప్పుడు మళ్లీ సీ ఎం ద్వారా శంకుస్థాపన చేయించడంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు వి మర్శిస్తున్నారు. అలాగే ఐటీ టవర్ ఏ ర్పాటుకు అప్పట్లో ఐటీ మంత్రిగా కేటీఆ ర్ శంకుస్థాపన చేశారు. ఐటీ భవన నిర్మాణానికి సైతం సీఎం ద్వారా మళ్లీ చేయించడంపై చర్చనీయాంశమవుతున్నది.
సీ ఎం స్థాయి వ్యక్తితో ఇలా గతంలో ఉన్న పనులకే మళ్లీ శిలాఫలకాలు వేయించ డం సముచితం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వనపర్తికి ఇంకా కావాల్సిన అనేక అభివృద్ధి పనులున్నాయి. వా టిపై దృష్టి సారించి కొత్త పనులకు శంకుస్థాపనలు చేయిస్తే ప్రజల విశ్వాసాన్ని పొందే అవకాశం ఉంటుంద న్న అభిప్రాయం కూడా వెల్లడవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.వందల కోట్ల పనులు మంజూరై ఉండగా, వాటిని అధికశాతం రద్దు చేయించారు.
వేరుశనగ, గొర్రెల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా నాడు మంత్రి హోదాలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వాటి ఊసే లేదు. సీఎం స్థాయి వ్యక్తి.. అందులో వనపర్తి కేంద్రంతో ప్రత్యేక బంధమున్న రేవంత్‌రెడ్డి ద్వారా కొత్త అభివృద్ధి పనులను చేపట్టి బాటలు వేయాలని ఇక్కడి వేధావులు, విద్యావేత్తలు, ఉద్యోగులు, రైతులు ఆశిస్తున్నా రు.
ఇలా పాత పనులకే శంకుస్థాపనలు పెట్టి ఏదో మొక్కుబడిగా కొన్ని పనులను కొత్త వాటిని చేర్చి ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సీ ఎం వనపర్తి పర్యటనను ఖరారు చేసి గొ ప్పగా సాధించింది ఏమీ లేదన్న భావన లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది రైతులు రుణమాఫీ సక్రమంగా అమలులేక అవస్థలు పడుతున్నారు. ఇక రైతుబంధు ఒకటి, రెండు, మూడెకరాలంటూ చెబుతున్నా.. బ్యాంకులకు వెళ్తే పడలేదన్న సమాధానాలతో సతమతమవుతున్నారు. ఇంకా బోనస్ డబ్బులు ప డక మరికొంత మంది రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కనీసం సీఎం సొం త గడ్డకు వస్తున్న సందర్భంలోనైనా ఈ ఒక్క జిల్లాలోని అన్నదాతలకైనా తీపికబురు అందించి ఉంటే బాగుండేందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
ఆదివారం ఉదయం 11:30 గంటల కు హెలీక్యాప్టర్ ద్వారా పాలిటెక్నిక్ వెను క భాగంలో సీఎం రేవంత్‌రెడ్డి ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి నేరుగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూ జలు చేస్తారు. అక్కడి నుంచి రేవంత్ కు టుంబం వనపర్తిలో నివాసం ఉన్నప్పటి ఇంటికెళ్లి కలుసుకుంటారు. అటునుంచి జెడ్పీ బాలుర పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి క్లాస్మెంట్స్, ఆత్మీయులతో సమావేశమై భోజనం చేస్తారు. అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో ఏ ర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.