వనపర్తి, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ) : తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జాతీయ సమైక్యతకు కట్టుబడి నాడు నిజాం నవాబు హైదరాబాద్ సం స్థానాన్ని విలీనం చేశారన్నారు. బుధవా రం సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా తెలంగాణ భవన్‌పై సింగిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సంద ర్భం గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి మాట్లాడుతూ విమోచన దినోత్సవం కాకుండా జాతీయ సమైక్యతా దినోత్సవంగా సెప్టెంబర్ 17ను నిర్వహించాలన్నారు.
నిజాం నవాబు స్వయం ప్రతిపత్తితో పాలన చేశారని, నవాబ్ది ఆధునిక దృక్పథంగా పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం సాగునీటి ప్రాజెక్టులు, భూ సంస్కరణలు, విద్య, వైద్యం, విశ్వవిద్యాలయాలు, రోడ్లు, రైల్వేస్టేషన్లు, బస్ డిపోలు ఏర్పాటు చేశారని, ప్రత్యేక న్యాయ వ్యవస్థ కోసం హైకోర్టును నవాబుల కాలంలోనే నిర్మించారని సింగిరెడ్డి గుర్తు చేశారు. కోయిల్‌సాగర్, పాత రామన్‌పాడు, డిండి, నిజాంసాగర్ ప్రాజెక్టులు నిర్మించి చక్కె ర, పత్తి అధికంగా పండించేలా రైతుల ను ప్రోత్సహించారని, ఇందుకు ని జాం చక్కెర ఫ్యాక్టరీ, ఆజంజాహి బట్టల మిల్లును అందుబాటులోకి తెచ్చారన్నా రు. 1946 నాటికి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజాపాల న కోసం తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా సాగిందని, ఈ క్రమంలోనే భారత యూనియన్‌లో జాతీయ సమైక్యత కోసం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారని వివరించారు.
నిజాంపై తప్పుడు ప్రచారం చేసి విమోచన దినంగా కొనసాగిస్తున్నారని, నాటి నెహ్రూ ప్రభుత్వం నవాబును రాజ్ ప్ర ముఖ్‌గా నియమించిన సంగతిని మాజీ మంత్రి గుర్తు చేశారు. అభివృద్ధి పట్ల నాటి నిజాం నవాబ్కు ఉన్న శ్రద్ధలో ఇసుమంతైనా నేటి పాలకులకు లేదని, సీఎం రేవంత్‌రెడ్డి, మోదీ, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే తన సమయాన్ని కేటాయించారని దుయ్యబట్టా రు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కేవలం 10 శాతం మిగిలిన పనులను పూర్తి చేయడంపై కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తుందని, మిగిలిన పనులను చేయించడం కోసం త్వరలో ఉద్య మ కార్యాచరణ తీసుకుంటామని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
లంబాడి జాతిని ఆదివాసి(ఎస్టీ)జాబితా నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో కేసు వేశారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. లంబాడ సమాజ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటే సుప్రీం లో కేసు వేసిన ఆ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌రెడ్డి సస్పెం డ్ చేయాలని డిమాండ్ చేశారు. నాటి సీఎం కేసీఆర్ బంజారాల కోసం ప్రత్యేక గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని, పోడు భూములకు పట్టాలు ఇచ్చారని, గిరిజన గురుకులాలు, కళాశాలలు ఏర్పాటు చేశారని, కల్యాణలక్ష్మి పథకంను లంబాడీల స్ఫూర్తితో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం గిరిజనులు భూములను దౌర్జన్యంగా తీసుకుంటున్నదని, లంబాడాల హక్కుల కో సం గిరిజనులకు అండగా బీఆర్ఎస్ నిలబడి పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేశ్‌గౌడ్, నాయకులు నందిమళ్ల అశోక్, కురుమూర్తియాదవ్, విజయకుమార్, కృష్ణా నాయక్, రాము లు, కర్రెస్వామి, రాజశేఖర్, చం ద్రశేఖ ర్, జాతృనాయక్, గిరి, జోహేబ్, హే మంత్ తదితరులు పాల్గొన్నారు.