Harish Rao | వెంకట్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జడ్చర్ల పర్యటనలో భాగంగా హరీశ్‌రావుకు గులాబీ సైన్యం అడుగడుగునా ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా మిడ్జిల్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కారుడు మన్యం వెంకట్ రెడ్డి విగ్రహాన్ని హరీశ్ రావు ఆవిష్కరించారు. డా.సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ,మాజీ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు మన్యం వెంకట్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పార్టీ నాయకులు,కార్యకర్తల కష్టకాలంలో ఆదుకునే వాతావరణం పార్టీలో ఉంది.. ఈ ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించి కార్యకర్తల గౌరవం పెంచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ కోసం కొట్లాడినవా… ఎప్పుడైనా జై తెలంగాణ అన్నవా..? ఉద్యమం చేసినవా..? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి.. అబద్ధాలు,మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చావ్..పాలమూరు జిల్లా కు ద్రోహం చేస్తున్నావ్.. పాలమూరు ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.
ఏపీ, కర్ణాటక గోదావరి, కృష్ణ ,తుంగభద్ర నీళ్లను దోచుకుపోతున్నారు.. మిడ్జిల్ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్. మీ కార్యకర్తల ప్రేమ అభిమానాలు చూస్తుంటే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మిడ్జిల్ గ్రామ అభివృద్ధి కోసం వెంకట్ రెడ్డి కృషి చేశారని మాజీ మంత్రి డా సి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉన్నారు. కార్యకర్తలే చందాలు వేసుకొని వెంకట్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వెంకట్ రెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.