మరికల్, ఆగస్టు 26 : నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో నెలకొన్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో తహసీల్దార్ రామకోటికి బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వినతి సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు నర్సన్ గౌడ్, తిరుపతి రెడ్డిల మాట్లాడుతూ.. భూభారతిలో దరఖాస్తులు చేసుకున్న రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
మండల కేంద్రంలోని పెద్ద చెరువు ఆయకట్టు కింద నిర్మిస్తున్న నిర్మాణాలను నిలుపుదల చేయాలని, గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్య పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాయమాటలతో మోసం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్ గౌడ్, రాజేష్, వెంకటేష్, శెట్టి మహేష్, చెన్నయ్య, శివకుమార్, సురేష్, దేవేందర్ గౌడ్, మహేష్, కురుమన్న తదితరులు పాల్గొన్నారు.