నాగర్‌కర్నూల్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : వీఆర్ఏలు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉద్యోగులు. ఇంతకు ముందున్న వీఆర్వోతో మొదలుకొని తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హత మేరకు పని చేస్తూ తలలో నాలుకలా వ్యవహరించే చిరు ఉద్యోగులు. ఈ ఉద్యోగులపై ప్రభుత్వం మొదటి నుంచీ సానుకూలతగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదివారం ఇచ్చిన ఆదేశాలతో ఈ ఉ ద్యోగులందరినీ రెగ్యులర్ చేయనున్నారు. రెండు నెలల కిందటే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఇలా వీఆర్ఏలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ లేకుం డా చేయడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశారు. ఇటీవలే కాంట్రాక్టు జేఎల్, డీఎల్‌తో పాటు వైద్య, ఆరోగ్యంతోపాటుగా ఇటీవలే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేశారు. ఇదే క్రమంలో వీఆర్ఏలకు గతంలో అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ ఉద్యోగులుగా మారనున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 2 వేల మంది వీఆర్ఏలు రెగ్యులర్ ఉద్యోగులుగా మారనున్నారు. వారి విద్యార్హత మేర కు ఇరిగేషన్, మిషన్ భగీరథ, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, ఆరోగ్య శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. ఇం దులో పది చదివిన వీఆర్ఏలను లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఉద్యోగులుగా గుర్తించనున్నా రు. దీని ప్రకారం వీఆర్ఏల విద్యార్హత, వ యస్సు మేరకు రెగ్యులర్ కానున్నారు. ఇం టర్ చదివిన వీఆర్ఏలను రికార్డు అసిస్టెంట్లుగా, డిగ్రీ, ఆపై చదివిన వారిని జూనియ ర్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరించనున్నారు.
61 ఏండ్లు దాటిన ఉద్యోగుల వారసులకు కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా 2014, జూన్ 2వ తేదీన అనంతరం 61 ఏండ్లలోపు ఉండి ఏ కారణం చేతైనా వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తూ చనిపోతే వారి వారసులకు కూడా ఉద్యోగం కల్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో వారి వారసుల విద్యార్హతల మేరకు ఉద్యోగాలు కేటాయించనున్నారు. కాగా వీఆర్ఏలకు ప్రభుత్వం పలు సానుకూల చర్యలు తీసుకున్నది. పెరిగిన జీవన వ్యయాలు, నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాలను ఏకంగా 64.61 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వీఆర్ఏల గౌరవ వేతనాలు ఒకేసారి రూ.6 వేల నుంచి రూ.10, 500 వరకు చేరుకున్నాయి. అలాగే మరో రూ.200 తెలంగాణ ఇంక్రిమెంట్‌ను ప్రకటించింది. ఇలా చిరుద్యోగులైన వీఆర్ఏల కోసం సీఎం కేసీఆర్ సాధ్యమైనంత సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నా రు. తరతరాలుగా సమాజానికి సేవ చేస్తు న్న వీరికి ప్రభుత్వం చేస్తున్న సహాయం వ్యక్తిగతానికి మాత్రమే కాకుండా సమాజానికి చేస్తున్న సేవగా రెగ్యులర్ చేస్తూ గుర్తింపు ఇవ్వడం విశేషం. వీఆర్ఏల్లో నిరక్షరాస్యుల నుంచి పీజీ వరకు విద్యార్హతలు కలిగిన ఉద్యోగులు ఉన్నారు. పలువురు డైరెక్ట్ రిక్రూట్మెంట్తో నియామకమయ్యారు. దీంతో వీఆర్ఏల విద్యార్హతలనూ క్రమబద్ధీకరణలో ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీని ఆధారంగా ఆయా ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులుగా నియమించను న్నారు. మొత్తం మీద ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేపట్టడంపై వేలాది మంది వీఆర్ఏల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
వీఆర్ఏల రెగ్యులరైజేషన్‌కు ప్రభు త్వం నిర్ణయించిం ది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 685 మం ది వీఆర్ఏలు ఉ న్నారు. ఇందులో 94మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియామకమయ్యారు. వీరి లో నిరక్షరాస్యుల నుంచి పీజీ చదివిన వీఆర్‌ఏలూ పని చేస్తున్నారు. ప్రభుత్వ వి ధానాల ప్రకారం వీఆర్ఏల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటాం.
– ఉదయ్‌కుమార్, కలెక్టర్, నాగర్‌కర్నూల్