Sri Laxmi Narasimha Swamy Temple | కొల్లాపూర్, ఫిబ్రవరి 26 : సింగోటంలోని శివకేశవ రూపమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన మహా అద్భుతం జరిగింది. లింగాకారంలో అత్యంత అరుదుగా భక్తులకు దర్శనమిచ్చే లక్ష్మీనరసింహస్వామి విగ్రహంపై సూర్యకిరణాలు పడ్డాయి. చాలా అరుదుగా ఇలా జరుగుతుందని ఆలయ పూజారి సతీష్ శర్మ తెలిపారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున పూజా కార్యక్రమాలలో భాగంగా స్వామి వారికి అభిషేకం చేస్తుండగా.. సూర్యకిరణాలు స్వామివారి నిజస్వరూప దర్శనంపై పడటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు పూజారి పేర్కొన్నారు. కాగా మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మార్మోగింది.
SLBC Tunnel Mishap | చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్.. సొరంగంలోకి ఉత్తరాఖండ్ టీం
Maha shivratri | శివరాత్రి స్పెషల్.. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా పోస్టర్లు
Maha Kumbh | యాత్రికులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్రాజ్.. 65 కోట్ల మంది పుణ్యస్నానాలు