మాగనూరు, జూన్ 27 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఏర్పాటు చేసిన కెనాల్ పైపుల తయారీకి ఇసుకను అక్రమంగా తరలించేందుకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రణాళిక వేసింది. ఇందుకోసం మాగనూర్ మండలం పెద్దవాగు నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించేందుకు సంస్థ సిబ్బంది మాగనూరు పెద్దవాగు వద్దకు చేరుకొనే రోడ్డు వేసే పనులు చేపట్టారు. పెద్ద వాగు నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుకను తరలించేందు కు సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు వాగు వద్దకు చేరుకొని టిప్పర్లను అడ్డుకున్నారు.
మా వాగు నుంచి ఇసుకను తరలించనీయమని గ్రామస్తులందరూ భీస్మించారు. కొన్నాళ్లు గా ప్రభుత్వం టీఎస్ఎండీసీ, ఆన్లైన్ ద్వారా ఇసుకను తరలించడంతో సాగునీరు, తాగునీరుకి చాలా ఇబ్బందులు ఎ దురోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, రాబోయే రో జుల్లో మరింత కష్టాలు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఈ సందర్భంగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాగనూరు మండల కేంద్రం నుంచి కాకుండా ఆన్లైన్లో, టీజీ ఎండీసీ నడిచే చోటు నుంచి ఇసుకను తరలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పెద్ద వాగు నుంచి ఇసుకను తరలించ వద్దని శుక్రవారం ఉదయం గ్రామస్తులంతా కలిసి స్థానిక తాసీల్దార్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
గ్రామస్తులు ఇసుక టిప్పర్లను అడ్డుకున్న విషయం తె లుసుకున్న ఎస్సై అశోక్బాబు వచ్చి రాగానే గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. అధికారికంగా అనుమతులు లేకున్నా ఇ సుక తరలింపును అడ్డుకుంటే మాత్రం కేసులు నమోదు చే స్తామని గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేశాడు. అ యితే మాగనూరు మండల కేంద్రం నుంచి తప్పా ఎక్కడి నుంచైనా ఇసుక కొట్టుకోవచ్చని, ఈ ప్రాంతంలో మాత్రం ఇసుకను తరలించనీయని హెచ్చరించారు.
ఇదే విషయమై తాసీల్దార్ నాగలక్ష్మిని వివరణ కోరగా ప్రస్తుతం వారి వద్ద మా వద్ద ఎలాంటి పర్మిషన్ లేదని అన్నారు. ఉన్నతాధికారులు ఫోన్ చేసి చెప్పడంతో మండల కేంద్రంలోని వాగు నుంచి ఇసుకను తరలించేందుకు మాట పూర్వకంగా అనుమతి ఇచ్చామని తెలిపారు. అయితే అధికారికంగా ఎ లాంటి పర్మిషన్ లేకుండానే వాగులో ఇసుక తరలించేందు కు రోడ్లు వేయడానికి పర్మిషన్ ఇచ్చిన సంబంధిత పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులపై ఎలాంటి పర్మిషన్ లేని దానికి ఇంత సపోర్ట్ ఎందుకని గ్రామస్తులు, ప్రజలు ప్రశ్నించారు. దీంతో చేసేది లేక కన్స్ట్రక్షన్ సిబ్బంది వెనుదిరిగారు.