నిండు జీవితానికి రెండు చుక్కలు
నిండు జీవితానికి రెండు చుక్కలు నినాదంతో పోలియో మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. జిల్లాలోని ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్క లు వేసేందుకు ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపడుతున్నది.
- నేటి నుంచి మూడ్రోజులపాటు పల్స్ పోలియో
- మహబూబ్‌నగర్ జిల్లాలో 1,10,136 మంది చిన్నారులు
- ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్యశాఖ అధికారులు
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 2 : నిండు జీవితానికి రెండు చుక్కలు నినాదంతో పోలియో మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. జిల్లాలోని ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్క లు వేసేందుకు ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపడుతున్నది. గ్రామీణస్థాయి నుంచి విజయవం తం చేసేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చే శారు. ఈ ఏడాది 1,10,136 మంది పిల్లలకు టీ కాలు వేయించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇం దులో భాగంగానే 4వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 3న కేంద్రాల్లో పోలియో చుక్కలు వేసిన తర్వాత మిగిలిన పిల్లలకు 4, 5వ తేదీల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వేస్తారు.
4 వేల మంది సిబ్బంది..
పల్స్ పోలియోకు వైద్యారోగ్య శాఖ 4 వేల మం ది సిబ్బందిని కేటాయించింది. ఆశావర్కర్లు 869, అంగన్వాడీ టీచర్లు 1,124, వ్యాక్సినేటర్లు 2,824, రూట్ సూపర్వైజర్లు 24 మంది ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 946 గ్రామాల్లో మొత్తం 1,10,136 మంది ఐదేండ్లలోపు చిన్నారులు ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ పోలియో చుక్కలను వేయనున్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో 583 బూత్‌లు, పట్టణాల్లో 93, బ స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సంతలు, జాతరలు, జనసందోహం ఉండే మరో 25 ప్రాంతాల్లోనూ పల్స్ పో లియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 24 మొబైల్ బూత్‌లు పనిచేయనున్నాయి. 10 స్టా క్ పాయింట్లు ఉండగా, రూట్ అధికారులు ప్రత్యేక వాహనాల ద్వారా వ్యాక్సినేషన్‌తోపాటు ఇతర సా మగ్రిని ఆయా బూత్‌లకు తీసుకెళ్లనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన సామగ్రిని అధికారులు ఇప్పటికే జిల్లాలోని పీహెచ్‌సీలకు పంపించారు. డీఎంహెచ్‌వో కృష్ణ మాట్లాడుతూ పల్స్ పోలియోపై ఇప్పటికే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహ న కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల డోస్‌లు సిద్ధంగా ఉంచామన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

