తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద శనివారం ఆయన 14వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ సేవలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన పోరాటాలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, తొర్రూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈనెపల్లి శ్రీనివాస్, రాయిశెట్టి వెంకన్న, మయూరి వెంకన్న, అమ్మపురం మాజీ సర్పంచ్ కడెం యాకయ్య, యాకమల్లు తదితరులు పాల్గొన్నారు.