అచ్చంపేట, జూన్ 22 : అచ్చంపేటలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమ్మేళనం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. భారీ ఎత్తున స్వచ్ఛందంగా, ఉ త్సాహంగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో బీకే ప్యాలెస్ ఫంక్షన్‌హాల్ కిక్కిరిసిపోయింది. హాల్ బయట వరకు కార్యకర్తలు నిలబడి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకుల ప్రంసగాన్ని ఆసక్తిగా విన్నారు. మధ్యా హ్నం 3:30 గంటలు దాటినా కార్యకర్తలు ఎవరూ సభ ప్రాంగణాన్ని వీడకుండా.. చివరి వరకు క్రమశిక్షణతో ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హరీశ్‌రావు దాదాపు గంటకుపైగా సాగిన ప్రసంగం కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది.
తన ప్రసంగంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, అధికారంలో వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలపై వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రైతులకు పంటబోనస్, రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్లు, వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను తెరపై ప్రదర్శిస్తూ వాటి అమలుపై ప్రశ్నిస్తూ ప్రజాపాలన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దేవుళ్ల సాక్షిగా, ఓట్ల పేరుతో ఇచ్చిన హామీలను సైతం గుర్తూ చేస్తూ ఎన్నికల్లో సమయంలో చెప్పిన మాటలు, ప్రస్తు తం తీసుకుంటున్న వైఖరికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వీడియో ద్వారా కార్యకర్తలకు చూపించారు. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ మాటతప్పుతూ మోసం చేస్తుందన్నారు.
అచ్చంపేటలోని అన్ని మండలాల నుంచి వేలాదిగా కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఫంక్షన్‌హాల్ సరిపోక ప్రాంగణం అంతా కార్యకర్తలతో నిండిపోయింది. అచ్చంపేట పట్టణం గులాబీమయంగా మారింది. రోడ్లవెంట భారీ ఫెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేశారు. యువకులు, పార్టీ నేతలు, పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో పాల్గొనగా పట్టణంలో గులాజీ సందడి కనిపించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి ఫంక్షన్‌హాల్ వరకు శ్రేణులతో కలిసి హరీశ్‌రావు ర్యాలీగా చేరుకున్నారు. సభ ముగిసేవరకు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం, హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రసంగాలను స్పందించడం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపినట్లు కనిపించింది.
అచ్చంపేట మండలం మార్లపాడుతండా వాసులు వరద లో సర్వం కోల్పోతే సీఎం రే వంత్‌రెడ్డి హెలికాప్టర్లో వచ్చి చూసినా నేటికి ఒక్క రూపా యి ఇవ్వలేదన్నారు. ప్రజల బాధలను చూసి వెళ్లడమే తప్పా వారికి చేయూత ఇచ్చే చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. సాయం చేయకపోతే అక్కడికి ఎందుకు వెళ్లావని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించమని హరీశ్‌రావు మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులను భవిష్యత్‌లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం నమోదు చేస్తున్న కేసులపై విచారణ జరిపిస్తామని, అవసరమైతే పరువు నష్టందావాలతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అధికారులు రిటైర్మెంట్ అయిన వదిలిపెట్టబోమని హెచ్చరించారు.