జడ్చర్లటౌన్, జనవరి 10: క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని, యువత క్రీడల్లో రాణించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాపోటీలు మంగళవారం ఉత్సాహంగా జరిగాయి. మండలంలోని మాచారంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలను ఎంపీ మన్నె, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మొదటగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వాలీబాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో 16 గ్రామాల నుంచి వాలీబాల్ జట్లు తలపడ్డాయి. ప్రథమ విజేత పట్టణంలోని పాతబజార్ జట్టు, ద్వితీయస్థానంలో పోలేపల్లి జట్టు గెలుపొందాయి. గెలుపొందిన జట్లకు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ మహేశ్, సీఐ రమేశ్‌బాబు, ఎస్సై వెంకటేశ్, వాలీబాల్ కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జనవరి 10: క్రీడలతోనే మానసికోల్లాసం అని జెడ్పీటీసీ శశిరేఖ, సీఐ జములప్ప అన్నారు. జూతీయ యు వజనోత్సవాల సందర్భంగా మంగళవారం మండలకేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో మండలస్థాయి 2కే రన్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. 2కే రన్ ప్రథమ విజేత మున్ననూర్‌కు చెందిన నవీన్, ద్వితీయ మల్లాపూర్‌కు జ్ఞానేశ్వర్, తృతీయ స్థానం లో మున్ననూర్‌కు చెందిన మల్లేశ్ నిలిచినట్లు తెలిపారు. గెలుపొందిన వారికి గురువారం బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సై రాంలాల్‌నాయక్, ఎంపీటీసీ గౌస్, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ అల్వాల్‌రెడ్డి, పీఈటీ పర్వతాలు, నాయకులు వెంకట్‌రెడ్డి, రాజేశ్వర్, సంపత్‌కుమార్, సాయిలు, నిరంజన్, భాస్కర్, వెంకటయ్య, గోపాల్, జహంగీర్, వరుణ్‌రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), జనవరి 10: క్రీడలతోనే శారీరక దృఢత్వం పెరుగుతుందని అడ్డాకుల ఎస్సై విజయ్‌కుమార్ అన్నారు. జాతీయ యువజనోత్సవాల సందర్భంగా మంగళవారం అడ్డాకులలో యువతకు 2కే రన్ నిర్వహించారు. పోటీల్లో మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల యువత పాల్గొన్నారు. పాల్గొన్న వారికి ప్రోత్సామక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత సెల్ఫోన్లకు దూరంగా ఉండి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు, పోలీస్‌సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యువత సద్వినియోగం చేసుకోవాలి
రాజాపూర్, జనవరి 10: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 6గంటలకు మండలకేంద్రంలో 2కే రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మండలస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని యువత, యవజన సంఘాల సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సై కోరారు.