మహబూబ్‌నగర్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ) : ఆదివాసీల హక్కుల కోసం ప్రశ్నిస్తూ పోరాటాలు నిర్వహిస్తున్న ఆదివాసి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ పట్ల పోలీసులు వ్యవహరించిన అత్యంత దారుణమైన ఘటనపైన విస్తృతంగా చర్చ జరుగు తుంది. అమ్రాబాద్ మండలం సార్లపల్లికి చెంది న మల్లికార్జున్‌ను శనివారం సాయంత్రం మన్ననూర్‌కు రాగా అక్కడ మన్ననూర్‌కు చెందిన ఆదివాసి నాయకులు, మల్లికార్జున్ మధ్య ఘర్షణ చోటు చేసుకున్నదని, ఈ ఘర్షణలో మన్ననూర్‌కు చెందిన ఐదుగురు మల్లికార్జున్‌ను అకారణంగా కొట్టి గాయపరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మల్లికార్జున్ అమ్రాబాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా విషయం తెలుసుకున్న మల్లికార్జున్ బంధువులు, కుటుంబ సభ్యు లు మల్లికార్జున్‌పై దాడి చేసిన వారిపై తిరిగి దాడి చేసినట్లు తెలిసింది. మల్లికార్జున్ అమ్రాబాద్ స్టేషన్లో ఉండడంతో ఆయన బంధువులు అ మ్రాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడ పోలీసు లు, ఆదివాసీల మధ్య వాగ్వాదం జరిగినట్లు తె లిసింది. పోలీసులు ఆదివాసి యువకుడిని కొట్టడంతో అతను చనిపోతానని పోలీస్ స్టేషన్ ప్రాం గణంలో ఉన్న చెట్టు ఎక్కాడు. ఈ ఘటనలో పోలీసులకు ఆదివాసీల మధ్య తోపులాట జరిగినట్లు తెలిసింది. అయితే అమ్రాబాద్ సీఐ పై ఆదివాసీలు, పోలీసుస్టేషన్‌పై దాడి చేసినట్లు పో లీసులు చెబుతున్నారు.
శనివారం రాత్రి అమ్రాబాద్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని ఆదివాసీల తెలిపారు. మల్లికార్జున్‌పై దాడి చేసిన వారిని వదిలిపెట్టి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మల్లికార్జున్‌ను పోలీసుస్టేషన్లో ఉంచుకొని కుటంబ సభ్యులకు చూపించక పోవడంతో కోపోద్రిక్తులైనట్లు తెలిసింది. పోలీసులు పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఆదివాసీలందరినీ ఇంటికి పంపించి మల్లికార్జున్‌ను తర్వాత పంపిస్తామని చెప్పి అందరిని పంపించినట్లు తెలిపారు. అయితే ఆదివాసీలు ఇంటికి వెళ్లగా మల్లికార్జున్‌ను మాత్రం ఇంటికి చేరుకోలేదు. పోలీసులను అడిగితే అప్పుడే పంపించామని తమ వద్ద లేడని చెప్పడంతో కుటుంబ సభ్యు లు, బంధువులు ఆందోళనకు గురయ్యారు.
మల్లికార్జున్‌ను మాత్రం పోలీసులు అమ్రాబాద్ స్టేషన్లోనే నిర్బంధించి రాత్రి మొత్తం గొడ్డును బాదినట్లు తీవ్రంగా కొట్టి పోలీసుస్టేషన్లోనే ఉంచుకున్నారని, పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక మల్లికార్జున్ అరుపులు, కేకలు వేస్తుంటే బయటికి వినిపించడంతో అక్కడే ఉన్న ఆదివాసీ యువకులు దగ్గరికి వెళ్లి చూడగా మల్లికార్జున్‌ను పడుకోబెట్టి తీవ్రంగా కొడుతున్నట్లు చూసిన యువకులను పోలీసులు దగ్గరకు పిలిచి కొట్టిన విషయం ఎవరికైన చెబితే మల్లికార్జున్ మళ్లీ బయటికి రాకుండా, ఎక్కడ కనిపించకుం డా చేస్తామని పోలీసులు హెచ్చరించి పంపించినట్లు ఆదివాసీలు ఆరోపించారు.
ఆదివారం పోలీసులు తమ వాహనాలతో సార్లపల్లి గ్రామానికి వెళ్లి ఆదివాసీ యువకులు, కుటుంబ సభ్యులను జీపులో ఎక్కించుకొని అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌కి తీసుకువచ్చారు. అప్పటికి మల్లికార్జున్ ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పలేదు. విషయం బయట తెలియడంతో మీడియా, ప్రజా సంఘా లు, ఇతర పార్టీల వారు ఒక్కొక్కరు పోలీస్‌స్టేషన్‌కి రావడం విషయం తెలుసుకోవడం మరి ఆదివాసీ నాయకుడిని నిర్బంధించారనే సమాచారం విస్తృతం అయింది. పోలీసులపైన, స్టేషన్‌పైన ఆదివాసీలు దాడి చేశారని వారందరిపైన కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని కలిసిన మీడియా వారికి పోలీసులు లీకులు ఇ చ్చారు. దాదాపు ఆదివాసీలు 60 మంది వరకు అచ్చంపేట పోలీసుస్టేషన్‌ను చేరుకొని పడిగాపులుగాచారు.
మా నాయకుడు ఎక్కడ ఉన్నాడో చూపించాలని అసలు ఉన్నాడా,లేడాఅని, ఎందుకు చూపించడం లేదని పోలీసులను ప్ర శ్నించారు. కుటుంబ సభ్యుల, బంధువుల ద్వా రా వివరాలు సేకరించేందుకు వెళ్లిన మీడియా వారిని పోలీసులు కలువనీయకుండా ఒకవేళ మీడియాకు చెబితే ఇంకా కేసులు బలంగా పెట్టి మల్లికార్జున్ బయటకు రాకుండా చూస్తామని, ఎవరైనా పోలీసులను కాదని మీడియాకు చెబితే వారిని వదిలి పెట్టమని హెచ్చరించడంతో ఆదివాసీలు మీడి యా వారితో మాట్లాడడానికి కూడా భయపడ్డా రు. సార్ మేము మాట్లాడితే కేసులు పెడతరం టా అందుకని అన్ని విషయాలు చెప్పడం లేదని ఆదివాసీ మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశా రు.
మీడియా వారిని లోపలికి ఎందుకు రప్పించారని వారిని గేటు బయటనే ఉంచాలని డీఎస్పీ శ్రీనివాసులు మీడియా వారిని బయటకు పంపించేశారు. దాదాపు కొన్ని గంటల పాటు కుటుంబ సభ్యులతో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. మల్లికార్జున్ ఎక్కడ ఉన్నాడో అని అడిగానా కూడా చెప్పలేదు. మామూలు ఆదివాసీ పేదల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రజలు చర్చించుకుంటున్నారు. మేము సీఐపై దాడి చేయలేదని సీఐ కింద పడిపోతుంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేశామని ఆదివాసీలు తెలిపారు. మాకు న్యా యం చేయాల్సిన పోలీసులే మాపట్ల ఇంత దా రుణంగా వ్యవహరించడం ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదని, మా నాయకుడిని సాయంత్రం వరకు ఎక్కడ ఉన్నా డో కూడా చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు.
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అచ్చంపేట డీఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఆదివాసీ నాయకుడు మల్లికార్జున్ నిర్భందించడం, కొట్టడం, ఆదివాసీలను పోలీసుస్టేషన్లో ఉంచడాన్ని తప్పు బట్టి వారిని వెంటనే ఇంటికి పం పించాలని చెప్పినట్లు తెలిసింది. ఆదివారం అ చ్చంపేటకు వచ్చిన మంత్రి సీతక్క ఈ విషయం పై ఆరా తీసునట్లు తెలిసింది. మంత్రి సీతక్క పర్యటన రోజే ఆదివాసీ నాయకుడిని పోలీసుస్టేషన్లో నిర్భందించి చిత్రహింసలు పెట్టడం పట్ల అందరూ ఖండించారు. చివరికి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉండడం తో పోలీసులు రిమాండ్‌కు తరలించకుండా సా యంత్రం మల్లికార్జున్, కొందరిని బెయిల్‌పై పం పించినట్లు తెలిసింది. అయితే ఈ విషయా న్ని ఇంతటితో వదిలేయాలని బయట ఎక్కడైనా పొ క్కిన ఎవరికైనా చెప్పిన మిమ్మల్ని వదిలిపెట్టమ ని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.