మహబూబ్‌నగర్, అక్టోబర్ 17 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫార్మసీ కళాశాలలను బంద్ చేసి సమ్మె నిర్వహిస్తున్నట్లు ఫార్మసీ కళాశాలల విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
గురువారం మహబూబ్‌నగర్‌లోని సరోజిని రాములమ్మ ఫార్మసీ విద్యార్థులు కళాశాల ఎదుట సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బాలరాజు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులు, సిబ్బంది భవిష్యత్‌ను కాపాడాలని కోరారు.