కొల్లాపూర్, జూన్ 12 : అసెంబ్లీ ఎన్నికల ముం దు రాష్ట్ర ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు రాష్ర్టాన్ని ఆగం చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. 90శాతం పూర్తి అయినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 10శాతం పెం డింగ్ పనులను చేయకుండా కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేస్తామని ప్రకటించడంతో సీఎం హెలికాప్టర్లో ప్రాజెక్టుల సందర్శనకు వచ్చారని మాజీ మంత్రి దుయ్యబట్టారు.
కొల్లాపూర్ పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్లో కొల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పోలింగ్ బూత్ స్థాయి సభ్యత్వం, సర్ మ్యాపింగ్‌పై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా సభ్యత్వ న మోదు కార్యక్రమ ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్, నా గర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కొల్లాపూర్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కా ర్యక్రమ ఇన్చార్జి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపూర్ వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి హాజరయ్యారు.
మలిదశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించుకున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. 2022 ఏడాదిలో ప్రపంచంలోనే ఉత్తమ సంక్షేమ పథకాలను పరిశీలించినప్పుడు 20 ఉత్తమ పథకాలు ఉంటే అందులో రైతు బంధు, రైతు బీమా పథకాలు ఉన్నాయని ఇది చరిత్ర అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతోందన్నారు. బీఆర్ఎస్ నాయకులకు భయపడి పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్‌లో ఉన్న 15 లక్షల క్యూబిక్ మీటర్ల పనిని ఎలా పూర్తి చేస్తారో చెప్పకుండా గత ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడంతోనే నీళ్లు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 27,081.95 ఎకరాలకు గానూ 26,950.97 ఎకరాల భూ సేకరణ పూర్తికాగా 128.75ఎకరాలను సేకరించలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు.
అన్ని రిజర్వాయర్ల వద్ద భూ సేకరణ పూర్తి అయిందన్నారు. కృష్ణానది నీళ్లను వట్టెం రిజర్వాయర్ వరకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయ త్నం చేయలేదని విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ టైంలో రూ.3లక్షల25వేల కోట్లు అప్పు అయితే, ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టని, ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో రూ.3లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం శ్మశాన వైరాగ్యం నెలకొన్నదన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో క్షుద్రరాజకీయాలు నడుస్తున్నాయన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ, బీఆర్ఎస్ పార్టీ చెందిన సర్పంచులను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్న మంత్రి జూపల్లి ఏ వేషం వేసుకొచ్చినా బీఆర్ఎస్ పార్టీలోకి రానిచ్చేది లేదన్నారు. అన్ని ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేసిన జూపల్లి కొల్లాపూర్‌ను ఏమి అభివృద్ధి చేయలేదన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయినా మేము నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముం దు నిలబెట్టామని గుర్తుచేశారు. కేఎల్ఐ, భీమా, జూరాల ప్రాజెక్టుల నిర్మాణంలో జూపల్లి పాత్ర శూన్యమన్నారు. రూ.50కోట్లతో బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో పాన్‌గల్ మండలంలో తలపెట్టిన రిజర్వాయర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి క్యాన్సిల్ చేయించాడని ఆరోపించారు.
అలాగే రూ.150 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు మొద లు పెట్టిన సింగోటం, గోపల్‌దిన్నె రిజర్వాయర్ పనులను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపివేసిందన్నారు. బ్యాంక్‌ను దివాళా తీయించిన ఘనుడు జూపల్లి కృష్ణారావు అని ఎవరో చేసిన అభివృద్ధిని కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులను వేధిస్తే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. నియోజకర్గంలోనైనా, రాష్ట్రంలోనైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి బరాబర్ అడుగుతామని కేసు లు పెట్టినా మిమ్మల్ని బరాబర్ ఓడిస్తామన్నారు.
ఆంధ్ర పాలకుల ఏజెంట్ తెలంగాణ సీఎంగా ఉన్నారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే కు ట్ర జరుగుతోందని, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించే కవచంగా బీఆర్ఎస్ పార్టీ ఉంద ని, మనం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలంటే బలమైన నిర్మా ణం ఉండాలన్నారు. సర్ మ్యాపింగ్‌తో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం జరుగుతోందన్నారు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో గెలిచిందన్నారు. అక్కడ లక్షా యాభైవేల దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో 25లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు కోసం కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. మమతాబెనర్జీ నియోజకవర్గంలో సర్ మ్యాపింగ్‌తో 60వేల ఓట్లను తొలగించినట్లు గుర్తుచేశారు. ఈ గందరగోళ స్థితిలో బీఎల్వోలతో పాటు సర్ మ్యాపింగ్‌లో రాజకీయా పార్టీల బీఎల్ఏలను కూడా తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. ఎన్నికల సంఘం కూడా ఆలోచన చేసి బీఎల్వోలతో పాటు బీఎల్ఏలకు అవకాశం ఇచ్చిందన్నారు.
దేశంలో సీఎం ఓడిపోవడం ట్రెండ్ నడుస్తోంది. నా నాలుకపై మచ్చ ఉంది.. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలలో 14 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను సీఎం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. సీఎం సొంత జిల్లాకు వస్తున్నాడంటే సొంత జిల్లా అభివృద్ధికి ఏమైనా హామీ ఇస్తాడని ఆశించినట్లు పేర్కొన్నారు. కానీ పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూలగొట్టాలని పిలుపునిచ్చారన్నారు. పాలమూరు నీ ఇంటి సొత్తు కాదని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.
బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చే దమ్ము కాంగ్రెస్‌కు లేదన్నారు. అక్రమ కేసులతో కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు దిగుతోందని, పోలీసులు లేకుండా బయటకు రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం దివాళ తీసిందని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. కొల్లాపూర్ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేసేందుకు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. గ్రామాల్లో కమిటీలను వేసుకొని సభ్య త్వ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులను గుండెలో పెట్టుకుంటే, కాం గ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల గొంతు కోస్తుందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి విమర్శించారు. అలివికానీ హామీలను ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులను పెడుతూ వేధింపులకు గురి చేస్తుందన్నారు. ఎన్మన్‌బెట్ల గ్రామంలో జరుగుతున్న ఇసుక అక్రమ దందాపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కొట్టారన్నారు. ఒక యువకుడు కేటీఆర్ ఫొటోతోపాటు నా ఫొటో పెట్టుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపినందుకు ఎస్సై బెదిరించారని గుర్తు చేశారు.
కల్వకోలులో బీఆర్ఎస్ పార్టీపై పాట పాడిన వ్యక్తిని పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేశారన్నారు. అలాగే పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడలోని బీఆర్ఎస్ సర్పంచ్ రవినాయక్‌పై అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. బీఆర్ఎస్ పార్టీకీ చెందిన సర్పంచులపై పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. చిన్నంబావి మండలంలోని లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి రెండేండ్లు గడిచినా ఆ కేసు ఎంతవరకు వచ్చిందో తెలియడం లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కరోనా సమయం కాకుండా మూడేండ్లలో జరిగిన అభివృద్ధి, జూపల్లి కృష్ణారావు 20ఏండ్లలో చేసిన చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.