Rishabh Pant : జీవితంలో ఎంత సంపాదించినా, కెరీర్ పరంగా గొప్ప స్థాయిలో ఉన్నా సరే సొంతగడ్డపై మమకారం మాత్రం తగ్గదు. అందుకు తాజా ఉదాహరణ భారత క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant). స్వరాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఇంటి స్థలం కొనాలని ఆశపడుతున్న ఈ వికెట్ కీపర్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రి సాయం కోరాడు. అతడలా పోస్ట్ పెట్టడంతో సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత సాయం చేస్తామని అభయమిచ్చారు.
టీమిండియా టెస్టు జట్టులో స్థిరపడిపోయిన రిషభ్ పంత్ మకాం మార్చాలనే ఆలోచనతో ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న అతడు స్వరాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఇల్లు కొనుక్కోవాలని భావిస్తున్నాడు. అయితే.. మనోడి చేతిలో సరిపోను డబ్బులున్నా అక్కడ భూమి మాత్రం దొరకడం లేదు. దాంతో.. ఏం చేయాలో పాలుపోక తన బాధ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి తెలిసేలా శుక్రవారం అర్ధ రాత్రి పోస్ట్‌లో వెల్లగక్కాడు.
@pushkardhami hello sir how’s you ??? It’s a long time for me especially being local from Uttrakhand . I have been trying to buy land to shift my base from Delhi to Uttrakhand and I couldn’t find anything facilitating and big to live here I love my Uttrakhand. My humble request…
— Rishabh Pant (@RishabhPant17) August 7, 2026
‘హలో సార్. ఎలా ఉన్నారు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు మకాం మార్చాలనుకుంటున్నా, గత మూడు సంవత్సరాలుగా అక్కడ భూమి కోసం వెతుకుతున్నా. కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. దయచేసి భూమి కొనుగోలులో నాకు సాయం చేయగలరు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో అన్ని పేపర్లు ఉన్న భూమిని కొనడం చాలా కష్టంగా మారింది. నేను ఎంతో ఇష్టపడే ఉత్తరాఖండ్‌లో మొదటి ఇల్లు కట్టుకునేందుకు అనువైన స్థలం దొరకడంలో సాయం చేయండి. నేను మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నా’ అని సీఎం పుష్కర్ ధామిని ఉద్దేశించి పంత్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసిన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
प्रिय ऋषभ, आप उत्तराखण्ड के गौरव हैं। आपने अपने शानदार खेल और उपलब्धियों से देश-दुनिया में देवभूमि का नाम रोशन किया है। अपनी मातृभूमि के प्रति आपका यह प्रेम और यहां वापस आकर योगदान देने की भावना अत्यंत सराहनीय है।
आपके द्वारा उठाए गए विषय के संबंध में संबंधित अधिकारियों को… https://t.co/v3iFQVpxUK
— Pushkar Singh Dhami (@pushkardhami) August 8, 2026
‘ప్రియమైన రిషభ్. భారత జట్టు తరఫున ఎన్నో విజయాలు, ఘనతలు సాధించిన నువ్వు ఉత్తరాఖండ్‌కు గర్వకారణం. మన దేవభూమి పేరును నువ్వ ప్రపంచవ్యాప్తం చేశావు. పుట్టినగడ్డపై నీకున్న ప్రేమ, ఈ నేలకు ఏదైనా చేయాలనుకుంటున్న నిన్ను అభినందిస్తున్నా. నీ అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులను ఆదేశించాను. నిబంధనల ప్రకారం అధికారులు అన్నీ పరిశీలించి త్వరలోనే నిన్ను సంప్రదిస్తారు’ అని సీఎం బదులిచ్చారు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పంత్.. మరోసారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు. లంకతో రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 9న మొదలవ్వనుంది.