Ramayana | భారతీయ సినీ పరిశ్రమ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ పురాణ ఇతిహాసమైన రామాయణాన్ని హాలీవుడ్ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో తెరపై ఆవిష్కరిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్, దక్షిణాది, అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులు భాగమయ్యారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇటీవల ‘రామాయణ’ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. భారీ విజువల్స్, గ్రాండ్ సెట్స్, పాత్రల లుక్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసే ఉద్దేశంతో మేకర్స్ ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఇంగ్లీష్ ట్రైలర్‌కు అంతర్జాతీయంగా మంచి స్పందన రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై గ్లోబల్ ఆడియెన్స్ దృష్టి పడింది. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్ ఎపిసోడ్స్‌ను రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. ఈ క్రమంలోనే సినిమా విడుదల తేదీ విషయంలో ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణ’ నవంబర్ 6న విడుదల కానుండగా.. భారత్‌లో మాత్రం నవంబర్ 8న విడుదల చేయనున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించినట్లు సమాచారం.
అంటే ఇతర దేశాల్లో ప్రేక్షకులు సినిమాను రెండు రోజుల ముందుగానే చూసే అవకాశం ఉండగా, భారతీయ ప్రేక్షకులు మాత్రం మరో రెండు రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. సాధారణంగా భారతీయ సినిమాలు స్వదేశంలో ముందుగా లేదా అదే రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం చూస్తుంటాం. కానీ ‘రామాయణ’ విషయంలో దీనికి భిన్నమైన షెడ్యూల్ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.భారత్‌లోనే అత్యంత కీలకమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘రామాయణ’ను స్వదేశంలో రెండు రోజుల ఆలస్యంగా విడుదల చేయడం వెనుక అసలు కారణం ఏమిటనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విడుదల తేదీకి సంబంధించిన అధికారిక వివరాలు, దేశాల వారీగా రిలీజ్ ప్లాన్‌పై మేకర్స్ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను గ్లోబల్ రిలీజ్‌గా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ విధమైన షెడ్యూల్‌ను రూపొందించి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.