నారాయణపేట, నవంబర్ 6: పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జనం పెద్ద ఎత్తున తరలిరా వడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. మధ్యాహ్నం 2గంటలకు సభ జరగాల్సి ఉండగా సీఎం హెలికాప్టర్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చినా జనం ఎంతో ఓపికతో ఉండి సీఎం కేసీఆర్ ప్రసంగం ముగిసే వరకు ఉన్నారు. నారాయణపేటకు సంబంధించిన పలు డిమాండ్లను ఎమ్మెల్యే ప్రస్తావించగా సీఎం కేసీఆర్ సాను కూలంగా స్పందించడంతో ప్రజల్లో ఎమ్మెల్యే పనితీరుపై నమ్మ కం కలిగినట్లయింది. సీఎం కేసీఆర్ ఓటు ఒక వజ్రాయుధం అని అలాంటి ఓటును వృధా చేసుకోవద్దని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎలాంటి నష్టం జరుగుతుందో, అలాగే కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఎంత నష్టపోయిందో, గత పదేండ్ల కాలంలో బీఆ ర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఎంత అభివృద్ది చెం దిందో పూసగుచ్చినట్లు చెప్పి ప్రజలను ఆకట్టుకున్నారు. పేట నియోజకవర్గంలో 139 గ్రామాలు, పట్టణంలోని 24 వార్డుల నుండి జనం వేల సంఖ్యలో తరలి వచ్చి సభను సక్సెస్ చేయ డంతో గులాబీ శ్రేణుల్లో అప్పుడే విజయోత్సవ సంబురాలు మొదలయ్యాయి. సమావేశం ఆయ్యే సరికి రాత్రి కావడంతో సీఎం కేసీఆర్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతు రాంమోహన్, మాజీ స్పీకర్ మధుసూదనచారి తదితరులు సీఎం వెంట ఉన్నారు.
ప్రజా ఆశీర్వాదసభకు పేట నియోజకవర్గంలోని 139 గ్రామాలు, 24 వార్డుల నుంచి గులాబి దండు తండోప తండాలుగా తరలివచ్చారు. ప్రజా ఆశీర్వాదసభ విజయవం తం చేయడానికి రెండు రోజుల నుంచి గ్రామ, మండలస్థాయి నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. అంతే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, తమకు సంక్షే మ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చూసేందుకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ఉందని తెలుసుకొని గ్రామాల నుండి ఉద యమే ప్రత్యేక వాహనాల్లో నారాయణపేటకు బయలుదేరారు. సభ 4 గంటలు ఆలస్యమైనా ఎంతో ఓపికతో వేచి ఉండి ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్ ప్రసంగం పూర్తి అయ్యేవరకు ఒపికతో ఉన్నారు. పేటలోని నాలుగు వైపుల రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోయాయి. సభ ముగిసిన అనంతరం పెద్ద సంఖ్యలో వాహ నాలు వెళ్తుడటంతో 2 గంటలపాటు ట్రాఫిక్జామయ్యింది.