మద్దూర్ (కొత్తపల్లి) ఫిబ్రవరి 8 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లి మండలంలోని నిడ్జింత గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రైతులు అడుగడుగునా మోసపోతున్నారన్నారు. గతనెల 26వ తేదీ కోస్గి మండలంలో చంద్రవంచలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాలుగు సం క్షేమ పథకాలకు అంకురార్పణ చేస్తున్నట్లు ప్రకటించినా నే టికి ఏఒక్క పథకాన్ని సంపూర్ణంగా అందించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులను ఆ దుకునేందుకు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ వేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రైతు రుణమాఫీ అంటూ మూ డు దఫాలుగా రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటు న్న రేవంత్ సర్కార్ నేటికీ పూర్తిస్థాయిలో కానందున రైతు లు బ్యాంకుల్లో వడ్డీలు చెల్లించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. అలాగే ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 అందజేస్తామని హామీ ఇచ్చి నేటికీ ఈ పథకం ఊసేలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన కోస్గి పట్టణంలో నిర్వహించే రైతు నిరసన దీక్షకు నియోజకవర్గంలోని కార్యకర్తలు,నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మద్దూర్, కొత్తపల్లి మం డల అధ్యక్షుడు, వంచర్ల గోపాల్, మధుసూధన్‌రెడ్డి, నాయకులు సలీం, వీరారెడ్డి, బసిరెడ్డి, జగదీశ్వర్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.