కోస్గి(దౌల్తాబాద్), జూలై 15: ‘సర్’పై అందరూ అప్రమత్తంగా ఉంటూ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త పడాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేం ద ర్‌రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్వాద్ గ్రామం లో బుధవారం ఆయన బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, బీఎల్ఏలు, కార్యకర్తలతో ‘సర్’ పై చర్చిం చారు. అనంతరం ‘సర్’ కొనసాగుతున్న తీరుపై మాజీ జెడ్పీటీసీ మహిపాల్ వి వరించగా మాజీ ఎమ్మెల్యే పట్నం స్వయంగా కొందరి ఎన్యూమరే షన్ ఫారాలను పూర్తి వివరాలతో నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాలు అందుకున్న ప్రతిఒక్కరూ వాటిని పూర్తి వి వరాలతో నింపి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలని సూచించారు.
ఏ ఒక్కరి ఓటు కూడా పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించా రు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ గుబాళింపు తథ్యమని మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీల అమలులో విఫలమై ఏం చేయాలో తోచక మతి తప్పి రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో రేవంత్‌కు ప్రజలు రాజకీయ సన్యాసం ఇస్తారన్నారు.‘సర్’పై ఏవైన సందేహాలు ఉంటే తనను నేరుగా అడగాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కేశవరెడ్డి, ఫకీరప్ప, అప్పిరాజు పాల్గొన్నారు.