కోస్గి, జూన్ 15 : 2034 వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలు కుతున్న రేవంత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ముందు కొడంగల్‌లో గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి గత ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠంపై కూర్చున్న నీకు వచ్చే ఎన్నికల్లో ఈ ప్రజలే మరోసారి ఓటమి రుచి చూపిస్తారని అన్నా రు. సోమవారం ఆయన కోస్గి ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. అంతకు ముం దు మీడియా ప్రతినిధులు తమ సమస్యలపై మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల పట్టాలు తమ వద్ద ఉన్నాయని వారు గుర్తుచేశారు. ఎన్నో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డివి మోసపూరిత హామీలని తెలియక ఇక్కడి ప్రజలు అమాయకంగా నమ్మి ఓటేస్తే వారిని కూడా వంచించారని విమర్శలు గుప్పించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎందుకు మొదలు పెట్టారో రేవంత్‌కు ఏమైనా అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. జూరాల కింద పండే పంటలకు నీలివ్వడం చేతకాని కాంగ్రెస్ పార్టీ క్రాప్ హాలిడే ప్రకటించి మళ్లీ నారాయణ పేట-కొడంగల్ పేరుతో నీరెలా ఇస్తారో ప్రజలకు, రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి 90 శాతం పూర్తయిందని దానిని పూర్తి చేస్తే దానికింద కొడంగల్ రైతులకు సాగునీరు అందేదన్నారు. కానీ పాలమూరు పూర్తయితే కేసీఆర్‌కు పేరొస్తదనే ఒకే ఒక్క ఉద్దే శంతో దానిని పక్కన పెట్టారన్నారు.
కనీసం నిన్ను నమ్మి గెలిపించిన కొడంగల్‌లో ఏ అభివృద్ధి చేశావో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. నీ సొంత నియోజకవర్గం లోని రైతులకు రైతుబంధు ఇవ్వలేని సీఎంవి 2034 ఏడాది వరకు సీఎంగా ఉం టానని ఎలా అంటావో నీకే వదిలేస్తున్నామన్నారు. 2034 ముచ్చట ఏమో గాని వచ్చే ఎన్నికల్లో ఎక్కడైతే మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచావో అదే చోటా అదే ప్రజలు నీ రాజకీయ భవిష్యత్‌కు సమాధి చేస్తారని అన్నారు. కొడంగల్‌లో ఉన్న రోడ్లను తీసేసి కమిషన్ల కోసం నూతన రహదారులను వేస్తున్నారని, అవి కూడా నాణ్యత లేని రహదారులే అని అన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి అధికారులు నాణ్యత లేని పనులు చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా వారిని చట్టం ముం దు ఉంచుతామని హెచ్చరించారు. కొడంగల్ ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఊరి కే కూర్చోమని దానికి తగిన మూల్యం చెల్లించేదాకా వదలమని అన్నారు.
నియోజ కవర్గంలో ఎక్కడ చూసినా కూల్చివేతలే కనిపిస్తున్నాయన్నారు. అభివృద్ది పేరు తో కోస్గి పట్టణంలో రహదారుల వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం రాగానే రైతులకు, ప్రజలకు మంచి రోజులు రానున్నాయని ఆయన అన్నారు. అనంతరం మండల విలేకరులంతా కలిసి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోపాటు కోస్గి బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట్ నర్సిములు, మండల నాయకులు నరేందర్‌రెడ్డి, బెజ్జు నీలప్ప, జ నార్దన్రెడ్డిలను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పోశ ప్ప, కోనేరు సాయప్ప, వెంకటేశ్, మన్నె నరేశ్ యాదవ్, శ్రీశైలం, బుగ్గప్ప, గోపా ల్, చెన్నప్ప, మాజీ జెడ్పీటీసీ మహిపాల్, ఫకీరప్ప, నారాయణ పాల్గొన్నారు.