Cesarean | బిడ్డకు జన్మనివ్వడమంటే ప్రతి తల్లికి పునర్జన్మతో సమానం. అయితే డెలివరీలో రెండు పద్ధతులు ఉండగా.. ఒకటి సాధారణం.. మరోటి సిజేరియన్.. సాధారణ పద్ధతిలో ప్రసవం కష్టమైన సందర్భంలో తల్లీబిడ్డ ప్రాణాలను రక్షించేందుకు ఆపరేషన్ చేస్తారు.. కానీ కొన్ని దవాఖానల్లో మాత్రం సిజేరియన్లకే మొగ్గు చూపుతున్నారు. రక్తం తక్కువగా ఉన్నదని, ఉమ్మ నీటి ప్రాబ్లం ఉన్నదని .. ఇలా ఏదో ఒకటి చెప్పి గర్భిణీ బంధువులను భయపెట్టి శస్త్రచికిత్సలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు దవాఖానల్లో దందా కొనసాగిస్తున్నారు.కాసులకు కక్కుర్తిపడిన వైద్యులు రూ.వేలల్లో బిల్లులు వేస్తున్నారు. వీటిని చెల్లించలేక పేద, మధ్యతరగతి మహిళలు అప్పులు తెచ్చి మరీ కడుతున్నారు. కాగా సర్కార్ దవాఖానల్లో మాత్రం సుఖ ప్రసవాలే జరుగుతున్నాయి. అధికంగా నార్మల్ డెలివరీలే అవుతుండడంతో గర్భిణులు క్యూ కడుతున్నారు.
అలంపూర్, మే 14 : గర్భిణులు కాన్పు కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే.. కాసులకు కక్కుర్తిపడి కొందరు వైద్యులు వారిని భయాందోళనకు గురిచేస్తూ సాధారణ కాన్పునకు బదులు కడుపు కోత లే పనిగా పెట్టుకున్నారు. వారికి శ్రమ తగ్గించేందుకు సిజేరియన్‌ను ఎంచుకోవడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ఆపరేషన్ ఖర్చు లు కూడా అధికమవుతున్నాయి. సాదారణ కా న్పు అయిన వల్ల ఖర్చు తక్కువవడంతోపాటు స దరు మహిళ వారంలో రోజువారీ తన పనులు స్వ తహాగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా సిజేరియన్ అయిన మహిళతోపాటు బిడ్డ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మూడు నుంచి ఐదునెలల వరకు ఆమె స్వతహాగా ఏపని చేసుకునేందుకు వీలు పడదు. పైగా ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. అందుకే పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెగ్యులర్ దవాఖానలతోపాటు బస్తీ, పల్లె దవాఖానలను, గ్రామానికో సబ్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి వైద్య సేవలను విస్తృతం చేసింది.
ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి.. వారు పుట్టినప్పటి నుంచి యుక్త వయస్సు వచ్చేంత వరకు పలు రకా ల పథకాల రూపంలో సర్కార్ ఆర్థిక సహాయం అందిస్తున్నది. కాన్పు సమయంలో కేసీఆర్ కిట్, యవ్వనంలో అంగన్వాడీల ద్వారా పౌష్టికాహా రం, వివాహం చేసుకోగానే కల్యాణలక్ష్మి, గర్భం దాల్చినపుడు నెలనెలా దవాఖానకు వెళ్లేందుకు 102 వాహనం ద్వారా ఉచిత సర్వీసు, ఉచిత వై ద్య పరీక్షలతోపాటు పౌష్టికాహరం పంపిణీ, సర్కా ర్ దవాఖానలో కాన్పు అయితే తల్లికి పారితోషకంతోపాటు బిడ్డకు కేసీఆర్ కిట్ రూపంలో పలు ఆట వస్తువులను అందిస్తున్నది. సర్కార్ దవాఖానల్లో అనుభవజ్ఞులైన వైద్యులే కాన్పులు చేస్తారు. ఇక్కడ 99శా తం సాధారణ కాన్పునకే ప్రాధాన్యం ఇస్తారు. మొదటి నుంచే గర్భిణికి సాధారణ కాన్పు అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ నెలనెలా చేసిన వైద్య పరీక్షలను ఆన్లైన్లో నమోదు చేస్తారు.
జిల్లాలో మొత్తం 37 ప్రైవేట్ దవాఖానలున్నాయి. కాగా అయిజ, గద్వాలలోని 17 దవాఖానల్లోనే కాన్పులు చేస్తున్నారు. వాటిలో గతేడాది నుంచి నేటి వరకు కాన్పుల లెక్కలు పోల్చి చూస్తే అన్ని దవాఖానల్లో మొత్తం 2,958 కాన్పులు చేశారు. వాటిలో సాధారణ కాన్పులు 758 ఉండగా.. 2,1 58 సీజేరియన్ చేయడం ఆశ్యర్యానికి గురిచేస్తున్న ది. అంటే మూడింతలు సీజేరియన్ కాన్పులే జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతున్నది.
జిల్లాలో 12 మండలాలకుగానూ 10 పీహెచ్సీ లు, ఒక సీహెచ్‌సీ, జిల్లాకేంద్రంతో కలిపి మొత్తం 12 దవాఖానాల్లో కాన్పులు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి మార్చి 2023 వరకు జిల్లాలో మొ త్తం 7,639 కాన్పులు చేశారు. పీహెచ్‌సీల్లో సాధారణ కాన్పులే 3,200.. అలంపూర్ సీహెచ్‌సీలో 159కిగానూ 111 సాధారణ కాన్పులు కాగా.. 48 సీజేరియన్ అ య్యాయి. జిల్లాకేంద్రంలో 4,280కిగానూ 2,241 సాధారణం, 2,039 సీజేరియన్ చేశారు. జిల్లా మొత్తంలో 7,639కిగానూ 5,552 సాధారణం, 2,087 సీజేరియన్ చేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.
* గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు వరకు ప్రత్యేక పాకేజీ
* మొదటిసారి కాన్పుకు వచ్చిన వారిని పలు వ్యాధులున్నాయని చెప్పి భయబ్రాంతులకు గురి చేస్తారు.
* బిడ్డ అడ్డం తిరిగిందని, ఉమ్మనీరు మింగిందని సాకులు చెప్పడం
* ప్రసవ విషయంలో ఆలస్యం చేస్తే తమ చేతుల్లో ఏమి ఉండదని, తామేమీ చేయలేమని భయాందోళనకు గురి చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నది. వసతిగృహాల ద్వారా చదువు, పెండ్లి వయస్సులో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, బాలింతలకు 102 ఉచిత వైద్యసేవలు, న్యూట్రీషన్ కిట్, పౌష్టికాహారం పంపిణీ, బిడ్డ పుట్టిన వెంటనే కేసీఆర్ కిట్ వంటివి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్నారు. సర్కార్ సేవలను సద్వినియోగం చేసుకోండి. ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ,ఎమ్మెల్యే గద్వాల
ప్రభుత్వం మహిళా అభివృద్ధికి స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. సర్కార్ దవాఖానల్లోనే కాన్పులు చేయించుకోవాలి. ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రభుత్వం పలు పథకాలను అందజేస్తున్నది. తల్లీబిడ్డల క్షేమం కోసం సర్కార్ దవాఖానలను ఆశ్రయించాలి.
– ఎమ్మెల్యే అబ్రహం, అలంపూర్
ప్రైవేట్ దవాఖానల్లో చేసే కాన్పుల్లో 25శాతం సాధారణ కాన్పులు చేస్తే, 75శాతం సీజేరియన్ చేస్తారు. సీజేరియన్ వల్ల మహిళలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడొద్దు. ప్రభుత్వ దవాఖానాల్లో అన్నివసతులూ ఉన్నాయి. సర్కార్ దవాఖానలో కాన్పు అన్నివిధాలా సురక్షితం. ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించి పేదలు సమస్యలు కొనితెచ్చుకోవద్దు. ప్రభుత్వ దవాఖానల్లో అనుభవం కలిగిన వైద్యులు ఉంటారు. వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ స్రవంతి, ఎంసీహెచ్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్