కోస్గి, ఆగస్టు 24 : సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. రెండు నెలల కిందట సర్జఖాన్పేట్-తోగాపూర్ మధ్య రోడ్డు పనుల కోసమని రైతుల భూమి కబ్జా చెయ్యగా అది కోర్టు ఆదేశాలతో ఆగిపోగా, పది హేను రోజుల కిందట నా ఇంటిని కాంగ్రెస్ నేతల నుంచి కాపాడండి అని వేడుకున్న దంపతుల కన్నీ టి కథ సుఖాంతం కాకముందే మీర్జాపూర్ గ్రామంలో మరో నేత పేదోడి ఇంటిని కూల్చి కబ్జాకు దిగాడని మరో బాధితుడు నీలి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మీర్జాపూర్ గ్రామం లో 4-92 ఇంటి నెంబర్ ఉన్నది.
ఈ ఇంటిని అదే గ్రా మానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత తన ఇంటి దగ్గర గల ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి తన స్థలంలో మరో ఇంటిని ని ర్మించడానికి బేస్మెంట్ కోసం గుంతలను కూడా తవ్వా రు. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. గ్రామం లో ఎవరికి చెప్పిన కూడా తన మాట వినకుండా కబ్జా చేసిన నేతకే మద్దతు పలుకుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయాడు. ఎవరికి చెప్పుకోవాలో తనకు తెలియదని బాధితుడు వాపోయాడు. అదికారులైనా స్పం దించి తన ఖాళీ స్థలాన్ని కాపాడాలని వేడుకుంటున్నాడు. ఇదే విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి బసప్పని వివరణ కోరగా తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అలాంటి ఘటన జరిగితే విచారణ చేస్తానని తెలిపారు.