మహబూబ్నగర్, జనవరి 2 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ సర్కారు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఒక కు టుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి పూచీకత్తు లేకుండా వందశాతం సబ్సిడీ రూపంలో అందించింది. ఈ పథకంతో లబ్ధిపొందిన కుటుంబం త మ జీవితంలో స్థిరపడి ఎవరివైపు చూడకుండా జీవించేందుకు ఈ పథకం ఎంతో దోహదపడింది. 2014 నాటి కుటుంబ సమగ్ర సర్వేలోని వివరాల ఆధారంగా ప్రభుత్వ యంత్రాంగం తిరిగి సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించింది. గ్రామస్థాయిలో సర్వే జరిపాక లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించిన అనంతరం లబ్ధిదారులను ఎంపికచేసింది. ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని దళితబిడ్డను ఆలోచింపజేసింది. అంతటి పేరుపొందిన ఈ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు గ్రౌండింగ్ చేస్తుం దా..? లేదా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు సంబంధించి మొదటి విడుతగా ని యోజకవర్గానికి వందమంది చొప్పున 300 మందికి ఒక్కొక్కొరికీ రూ.10లక్షల చొప్పున దళితబంధు సాయం అందించింది. వీటిలో లబ్ధిదారులు ట్యాక్సీలు, సూపర్మార్కెట్లు, ప్రొైక్లెనర్లు, డీసీఎంలు, డెయిరీఫాంలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో రెండో విడుత కింద ప్రతి నియోజకవర్గం నుంచి 1100 మంది లబ్ధిదారులను మొత్తం 3,300 మందిని ఎంపిక చేసింది. ఎన్నికలకు ముందు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే దళితబంధు డబ్బులు మీ ఖాతాల లో జమ అవుతాయని అధికారులు సైతం చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దళితబంధు పథకం ప్రశ్నార్థకంగా మారింది. రెండో విడుత సాయం అందుతుందా..? కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకానికి నిధులు గ్రౌండింగ్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.