SLBC Tunnel Mishap | కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒకరి మృతదేహం లభ్యం.. !
SLBC Tunnel Mishap | దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 16 రోజులుగా 12 సంస్థలకు చెందిన రెస్క్యూ బృందాలు మూడు షిఫ్టులుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. రాత్రి వెళ్లిన రెస్క్యూ బృందానికి ఒక కార్మికుడి మృతదేహం కనిపించడంతో వెలికి తీస్తున్నారు.
SLBC Tunnel Mishap | అచ్చంపేట, మార్చి 9 : దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 16 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. అయితే టన్నెల్ లోపల చివరి భాగంలో టీబీఎం మిషన్ కింద ఒక కార్మికుడి మృతదేహం లభ్యమైందని రెస్క్యూ బృందాల ద్వారా తెలిసింది. ఒక చేయి బయట పడటంతో అట్టి మృతదేహం బయటకు తీయడానికి మట్టిని తవ్వుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు మరో రెండు మృతదేహాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
12 సంస్థలకు చెందిన రెస్క్యూ బృందాలు మూడు షిఫ్టులుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. రాత్రి వెళ్లిన రెస్క్యూ బృందానికి ఒక కార్మికుడి మృతదేహం కనిపించడంతో వెలికి తీస్తున్నారు. మరో రెండు మృతదేహాలు అక్కడే ఉండొచ్చని తవ్వకాలు జరుపుతున్నారు. అయితే అధికారులు మృతదేహం లభ్యమైన విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇంకా బయటకు చెప్పడం లేదు. లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందం ఒక మృతదేహాన్ని గుర్తించి ఉదయం బయటకు వచ్చినట్లు తెలిసింది.
అంబులెన్సుల ద్వారా నాగర్ కర్నూల్ ఆసుపత్రికి..
బయటకు తీసిన మృతదేహాలను అంబులెన్సుల ద్వారా నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు జిల్లా కలెక్టర్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రాత్రి రెవెన్యూ అధికారులు నాగర్ కర్నూల్ నందు హాస్పిటల్ కి వెళ్లి అంబులెన్సులను, సిబ్బందిని అలర్ట్ చేశారు.
ఆదివారం ఎప్పుడైనా మృతదేహాలు బయటకు వస్తాయని డాక్టర్లు, సిబ్బంది, అంబులెన్సులు రెడీగా ఉండాలని అలర్ట్ చేశారు. టన్నెల్ లోపల భారీగా శిథిలాలు, మట్టి, బురద చేరడంతోపాటు మరో పక్క భారీగా నీళ్లు ఉబికి వస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. మృతదేహాలను వెలిగితీసేందుకు అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తవ్వుతున్న క్రమంలో దుర్వాసన వస్తుందని చెబుతున్నారు. కేరళకు చెందిన రెండు క్యాడవర్ డాగ్స్ లతో స్క్వాడ్ బృందం టన్నెల్లోకి మరోసారి లోపలికి వెళ్లారు. లోపల క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ డేటా ఆధారంగా గుర్తించిన స్థలాల్లో తవ్వకాలు జరుపగా ఒక మృతదేహం లభ్యం కావడంతో మిగిలిన మృతదేహాలను కూడా గుర్తించడానికి మరోసారి క్యాడవర్ డాగ్స్ బృందం లోపలికి వెళ్లారు. ఒక మృతదేహం బయటపడటంతో సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు.

Read Also :
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

