గద్వాల, మే 24 : జిల్లాలో మక్క రైతుల గోసం ఎవరికి పట్టడం లేదు. దీంతో మక్క సాగు చేసిన రైతులు తమ పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పంట సాగు చేయడం ఒక ఎత్తైతే దానిని అమ్ముకోవడానికి అంతకు మించి ఇబ్బందులు పడుతున్నారు. పంట సాగు చేసి కొనుగోలు కేంద్రాలకు రైతులు మక్కలు తీసుకొస్తే గన్నీబ్యాగులకు, కొనుగోలుకు, గోదాంలకు తరలించడానికి టోకెన్లు ఇస్తుండడంతో టోకెన్ల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం కురుస్తున్న అకాలవర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతుల మక్కలు తూకం వేసిన తర్వాత వాటిని గోదాంలకు తరలించే వరకు రైతు ల బాధ్యత అని ప్రభుత్వం చెప్పడంతో రైతుల మక్కలు తూకం వేసిన వాటిని గోదాంలకు తరలించడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల తూకం వేసిన ధాన్యం అలాగే ఉండి పోతుం ది. గోదాంలకు మక్కలు తరలించాలని రైతులు అధికారులను కోరితే హమాలీల కొరత ఉందని సాకు చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి మరో విధంగా ఉంది. మక్కలు తరలించడానికి టెండర్ పొందిన కాం ట్రాక్టరే, వరి ధాన్యాన్ని గోదాంలకు తరలించడానికి టెం డర్ దక్కించుకోవడంతో నిర్లక్ష్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితిని అధికారులు బయటకు పొక్కనీయకుండా కాంట్రాక్టర్కు వత్తాసు పలుకుతున్నారు.
అకాల వర్షానికి అవస్థలు పడుతున్న రైతులు
గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులోఏర్పాటు చేసి న మక్కల కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగో లు చేసిన ధాన్యం శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొంత మేర తడిసింది. ధరూర్ మండలం ఓబులోనిపల్లి గ్రామానికి చెందిన రైతు సురేశ్ వద్ద 400బస్తాల మక్కలను ప్రభుత్వం నెలకిందట కొనుగోలు చేసింది. అయితే వాటిని గో దాంకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. వాటిని తిరిగి ఇతర బస్తా ల్లో నింపడానికి ఒక బస్తాకు హమాలీలు రూ.6 ఇచ్చి తిరిగి కొత్త బస్తాలో నింపిస్తున్నాడు.
అదే విధంగా మల్దక ల్ మండలం అమరవాయి గ్రామానికి చెంది న రైతులు రాము, పరశురాములు కొనుగోలు కేం ద్రానికి మక్కలు తీసుకొచ్చి నెల రోజులైంది. వారం కింద తూకం వేశారు.. గోదాంకు తరలించలేదు. రాత్రి కురిసిన వర్షానికి మక్క సంచులపై కప్పిన టార్ఫాలిన్ నుంచి వర్షం నీరు కిందకుపోవడంతో నీటిని తొలిగించి ఆరబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతుంది. దీనికి తోడు మార్కెట్షెడ్ల్లో కొనుగోలు చే సిన బస్తాలు నిల్వ ఉంచడంతో రైతులు ఆరుబయటనే తమ ధాన్యం ఉంచి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.