Krishna River | మాగనూరు మార్చ్ 26 : మాగనూరు కృష్ణ మండలాల పరివాహక ప్రాంతమైన కృష్ణానదిలో నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఈ పంటలకు సాగునీరు కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాలలో ఉన్న నీటిపారుదల అభివృద్ధి సంస్థలు ముడుమాల్ ఏ, ముడుమాల్ బి, మురారి దొడ్డి గుడబల్లూర్, కృష్ణ, తంగిడికి ఎత్తిపోతల పథకం లిఫ్టులపై రైతులు ఆధారపడి కొన్ని వేల ఎకరాలు వరి పంట సాగు చేస్తున్నారు. అయితే ఎండాకాలం రాకముందే కృష్ణానదిలో నీళ్లు పూర్తిగా ఇంకిపోవడంతో రైతులకు సాగునీరు కష్టాలు ఎదురవుతున్నాయి.
కొంతమంది రైతులయితే కృష్ణా నదిలో మధ్యలో నుండి పెద్ద పెద్ద మోటార్లు పెట్టి సాగునీరుని నది ఒడ్డున డంపు చేసుకొని వేరొక మోటార్ల ద్వారా పొలాలకు సాగునీరు అందేలా జాగ్రత్తలు పడుతున్నారు లిఫ్టుల ద్వారా అయితే సాగునీరు అందించాలంటే కృష్ణానదిలో పుష్కలంగా నీరు ఉండాలి కృష్ణానదిలో నీళ్లు సక్రమంగా లేకపోవడంతో లిఫ్ట్ లకు సక్రమంగా సాగునీరు అందడం లేదని దీని ద్వారా మోటార్లు నాలుగు ఉన్న కాడ రెండు ఆన్ చేయాల్సి వస్తుందని రెండు ఉన్న కాడ ఒకటి ఆన్ చేయాల్సి వస్తుందని ఇలా 24 గంటలు మోటర్లు ఆన్ లో ఉంచిన చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలంటే నాన్న అవస్థలు పడాల్సిందేనని వీటికి తోడు లో వోల్టేజ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుందని లిఫ్ట్ ప్రెసిడెంట్లు మొరపెట్టుకుంటున్నారు.
ఇలా 24 గంటలు మోటర్లు ఆన్ చేసి ఉంచడంతో వందల హెచ్‌పీ మోటార్లు కాలిపోయే అవకాశం కూడా ఉందని. ఇక్కడ సాగునీరు సక్రమంగా అందక అక్కడ మోటార్లు కాలిపోయి రైతులకు నానా ఇబ్బందులు ఎదురవుతాయని దీనివల్ల కొన్ని వందల మంది రైతులు నష్టపోతారని వారు వాపోయారు.
కృష్ణా నదిలో సక్రమంగా నీరు ఉంటేనే లిఫ్ట్‌లో ఉండే మోటార్లు మొత్తం స్టార్ట్ చేయడంతో రైతులకు సక్రమంగా సాగునీరు అందుతుందని కృష్ణానదికి నారాయణపూర్ డ్యాం నుండి నీళ్లు వదిలేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని లేకపోతే రైతులకు నానా ఇబ్బందులు ఎదురవుతాయని ఈ సందర్భంగా లిఫ్ట్ ప్రెసిడెంట్లు తెలిపారు.
లిఫ్టులపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం : కోల్పూర్ బన్నప్ప
లిఫ్టులపైనే చాలామంది రైతులు ఆధారపడి వరి సాగు చేస్తున్నామని ఇప్పుడు ఎండాకాలం రాకముందే కృష్ణానదిలో నీళ్లు ఎండుకపోతున్నాయని.. దీనివల్ల లిఫ్టునకు నీరు అందడం లేదని.. నీళ్లు అందకపోతే మాకు సాగునీరు కూడా మాకు అందవు .ఎమ్మెల్యే కృష్ణానదికి నీళ్లు వచ్చేలా సంబంధిత అధికారులతో మాట్లాడి మాకు సాగునీరు అందేలా చూడాలి.
24 గంటలు మోటర్లు ఆన్ చేసిన చివరి ఆయకట్టకు సాగునీరు అందించలేకపోతున్నాం : కోల్పూర్ లిఫ్ట్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్
మా లిఫ్టులో 132 హెచ్పీలకు సంబంధించిన మోటార్ల ద్వారా రైతులకు సాగునీరు అందజేస్తున్నాం. అయితే కృష్ణానదిలో నీళ్లు లేకపోవడంతో మూడు మోటార్లు ఆన్ చేయాల్సి ఉండగా ఒక మోటర్ మాత్రమే స్టార్ట్ చేసి సాగునీరు అందిస్తున్నాం. ఇలా 24 గంటలు మోటార్లు స్టార్ట్ చేసి సాగునీరు అందించిన చివరి ఆయకట్టుకు సాగు నీరు అందించలేము. దీనివల్ల మోటార్లు కాలిపోయే అవకాశం ఉంది. కృష్ణానదిలో నీరు పుష్కలంగా ఉంటే మోటార్లు మొత్తం ఆన్ చేసి 12 గంటల్లోనే సాగునీరు చివరి ఆయకట్టు వరకు అందిస్తాము
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి