వనపర్తి, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఒ రగబెట్టింది ఏమున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంటేనే పచ్చి మోసమని, ఆకలి చావులు, ఫ్లోరైడ్ మహమ్మారి, కరువు పరిస్థితులకు నిలువుటద్దమని సింగిరెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీ ధర్‌తో కలిసి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలప్పుడు పాలమూరు బిడ్డనంటూ పదేపదే.. ప్రచారం చేసుకున్న రేవంత్‌రెడ్డి ఇప్పు డు సీఎంగా పాలమూరుకు ఒరగబెట్టింది ఏమున్నదన్నా రు.
మెజార్టీ పనులు పూర్తి చేసుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ఒక్కరోజైన చర్చించలేదన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి సాగునీటిని వాడుకునే అవకా శం ఉన్నా.. రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తప్పు డు ప్రకటనలతో వాస్తవాలను పక్కకు పెడుతూ గత ప్రభు త్వం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 90శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగం లేకుండా ఏడాదిపాటు నిర్లక్ష్యం చేశారన్నారు. 2015లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశార ని, ఈ ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు చేసి కాంగ్రెస్ నిధులు రాకుండా ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేసినా.. రాష్ట్ర నిధుల నుంచే ఖర్చు చేయాలని నాటి కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు.
అలాగే పర్యావరణ శాఖ వెయ్యి కోట్ల జరిమానా విధించేలా చేసిన కుట్రలన్నీ పటాపంచలు చేసి మెజార్టీ పనులను చేశారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడిన మాటలు శుద్ధఅబద్ధాలు అని నిరంజన్‌రెడ్డి కొ ట్టిపారేశారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి వాటాను కొ ల్లగొడుతుంటే.. సీఎం, మంత్రులు మౌనం దాల్చారన్నా రు. ప్రజాసమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఏ సమస్య వచ్చినా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత ప్ర భుత్వం అంటూ నోరు పారేసుకుంటున్నాడన్నారు. నాగార్జునసాగర్ నుంచి ప్రతిరోజు 10 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
అభివృద్ధిబాట పట్టిన రైతులను మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన చేస్తున్నదని, 3 ఎకరాల వరకు రై తుభరోసా వేశామని చెబుతున్న ప్రభుత్వం అక్షరాల తొ మ్మిదిన్నర లక్షల మంది రైతులను వివిధ కారణాల పేరుతో తొలగించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ రం గం డమాల్ అయ్యిందని, సేద్యం కుప్పకూలుతున్నది, రైతులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్ల మరణాలు, మహిళలు, వృత్తిదారులు, చివరకు వృద్ధులు సైతం ఆందోళనలో ఉ న్నారని పేర్కొన్నారు. ఇలా రాష్ట్రంలో ఏ ఒక్కరూ కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేరన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతుంటే, రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నట్లు అని నిరంజన్‌రెడ్డి ప్ర శ్నించారు.
రేవంత్ రెడ్డి ఇక్కడి పొలాలు ఎండుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో ఆకలి చావులు, అంబలి కేంద్రాలు, కరువు, వలసల ముఖచిత్రంగా కాంగ్రెస్ పాలనలు కొనసాగాయని, రాష్ట్ర సాధన అనంతరం వాటిని రూపుమాపీ అభివృద్ధి దిశగా అడుగు లు పడుతున్న వేళ ఇలా.. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తెలం గాణను నాశనం చేస్తున్నదన్నారు. ఏపీ అధికంగా వాడుతున్న సాగునీటిపై పోరాటం చేయాలని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అడుగడుగునా కేసీఆర్ ప్రతిబింబం కనిపిస్తుందన్నారు.
నేడు సాధారణ రైతులు కూడా క్యూసెక్కులను మాట్లాడుతున్నారంటే, అది కేసీఆర్ చేపట్టిన గత జలసాధన ఉద్యమ ఫలితమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం పడగొట్టేలా కాంగ్రెస్ పాలన సాగుతుందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాగునీళ్లు ఇచ్చిందని చెప్పడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య, కురుమూర్తి, కృష్ణనాయక్, రఘుపతి రెడ్డి, కర్రెస్వామి, విజయ్‌కుమార్, అశోక్, రాము, దిలీప్‌రెడ్డి, పరంజ్యోతి, జోహెబ్, రహీం తదితరులు పాల్గొన్నారు.