వనపర్తి, నవంబర్ 26(నమస్తే తెలంగాణ) : సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో సత్తా చాటేందుకు సంసిద్ధులు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అమలు చేయని హామీలే ఎన్నికల్లో అస్ర్తాలుగా మలుచుకోవాలని పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేం ద్రంలోని తెలంగాణ భవన్లో వనపర్తి మండలం, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కాం గ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు అనేక హామీలు రెండేైళ్లెనా ఆచరణకు నోచుకోలేదన్నారు. మహిళలకు రూ.2500, విద్యార్థులకు స్కూటీలు, కల్యాణలక్ష్మిలో తులం బంగారం, వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్ పెంచలేదన్నారు. అలాగే అరకొరగా అమలు చేసిన రుణమాఫీ, రైతు భరోసా వాటికి సంబంధించి సగం వరకు అసంతృప్తులున్నారని, ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం రేపటి ఎన్నికల్లో బ్రహ్మస్ర్తాలుగా ఉపయోగపడుతాయని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మనం చేయాల్సిన పనిగా నిరంజన్‌రెడ్డి వివరించారు.
గ్రామాల్లో సమిష్టి నిర్ణయం తో ఎన్నికల్లో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టడమే ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పా టై రెండేళ్లు గడిచిపోయిందని, కాంగ్రెస్ హామీల మోసాలపై ప్రజల్లో తీవ్ర కసి ఉందని దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు సొమ్ము చేసుకోవాలన్నారు. గతంలో గెలుపొందిన సర్పంచ్ స్థానాలన్నిటినీ తిరిగి కైవసం చేసుకునేందుకు జనంలోనే ఉండాలని, ఇందుకు తగిన కార్యాచరణతో ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని నిరంజన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తల అభిప్రాయాలతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, అలా గే పార్టీకి ద్రోహం చేసే వారిపై ప్రమత్తంగా ఉండాలన్నారు. అభివృద్ధి పనులన్నీ మనం పూర్తి చేస్తే.. కేవలం కాంగ్రెస్ వాటిని ప్రారంభించుకుంటూ వెళ్తున్నారే తప్పా ఒక్క కొత్త అభివృద్ధి పనిని కూడా చేపట్టలేదన్నారు.
ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ పేరుతో మహిళలకు పంపిణీ చేసిన చీరలను తీసుకుని ఓట్లేయాలని కాంగ్రెస్ నాయకులు కోరడం సిగ్గుచేటని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా ప్రజల ఓట్లకు ఇందిరమ్మ చీరలకు లంకె పెట్టడం చూస్తే మహిళలను అవమానించినట్లేనన్నారు. రాష్ట్రం లో పేదరికాన్ని నిర్మూలించకుండా… ప్రోత్సహించినట్లుగా శాశ్వత పేదరికానికి చిరునామాగా ఇందిరమ్మ పేరుతో కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందని, కేవలం 17శాతంతోనే మమ అనిపించిందన్నారు.
మరికొన్ని చోట్ల బీసీలకు 3 నుంచి 4శాతం రిజర్వేషన్లు అమలు కాలేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను ఫణంగా పెట్టిన నవంబర్ 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలన్నారు. అంతకు ముందు రాజ్యాంగ దినోత్స వం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, నాగం తిరుపతిరెడ్డి, వాకిటి శ్రీధర్, కురుమూ ర్తియాదవ్, అశోక్, రమేశ్‌గౌడ్, మాణిక్యం, రాములు, వేణుయాదవ్, కృష్ణానాయక్, రఘుపతిరెడ్డి, సామ్యానాయక్, కర్రెస్వామి, దిలీప్‌రెడ్డి, సేనాపతి, పరంజ్యోతి, నాగన్న, కంచె రవి, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, గులాంఖాదర్, ఖా న్, రహీం, జాతృనాయక్, జహంగీర్ పాల్గొన్నారు.