అలంపూర్/శ్రీశైలం, అక్టోబర్ 3 : ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘ నంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అ లంపూర్ జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించారు. యాగశాల ప్రవేశం, మహాగణపతి, రుత్విక్వరణం, పుణ్యాహవచనం, సర్వతోబద్ర మంటప ఆవాహనం, మహాకలశ స్థాపన, చం ఢీహోమాలు నిర్వహించారు.
ధ్వజస్తంభానికి నందీశ్వరుడి చిత్రపటంతో జెండావిష్కరణ చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. అనంతరం బలిహరణ చేశారు. ఈవో పురేందర్కుమార్ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు జోగుళాంబ అమ్మవారు శైలపుత్రీదేవిగా దర్శనమిచ్చారు. శ్రీశైల మహాక్షేత్రంలో నవరా త్రి ఉత్సవాలను శాస్త్రోకంగా ప్రారంభించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. తొలిరోజు భ్రామరీ అమ్మవారిని ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన వేదికపై శైలపుత్రి రూపంలో అలంకరించి విశేష పూజలు చేశారు.