Maganoor Mandal | క్యాజువల్ లీవ్లో ఏకోపాధ్యాయుడు.. పాఠశాల నిర్వహణ గాలికేనా మరి..?
Maganoor Mandal | ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న టీచర్ సెలవులో ఉంటే ప్రత్యామ్నాయ బోధనా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, విద్యార్థుల చదువులపై కనీస పర్యవేక్షణ కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Maganoor Mandal | మాగనూరు, సెప్టెంబర్ 01 : మాగనూరు మండలం బైరంపల్లి గ్రామంలో విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నా వారికి బోధించాల్సిన ఉపాధ్యాయుడు మాత్రం క్యాజువల్ లీవ్లో ఉండటంతో పాఠశాల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న టీచర్ సెలవులో ఉంటే ప్రత్యామ్నాయ బోధనా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, విద్యార్థుల చదువులపై కనీస పర్యవేక్షణ కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు తరగతి గదిలో ఉన్నప్పటికీ బోధన మాత్రం నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. చిన్నారుల విద్యా భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంపై మండల విద్యాధికారి ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉన్నా, పాఠశాల పరిస్థితిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయుడు సెలవులో ఉంటే ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయడం ఎవరి బాధ్యత..? విద్యార్థుల విలువైన విద్యా సమయం వృథా అయితే బాధ్యత ఎవరిది.. ? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలో నెలకొన్న పరిస్థితిపై వెంటనే విచారణ చేపట్టి, విద్యార్థులకు నిరంతర బోధన అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.
Read Also :
Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కత్తులతో మహిళ దాడి.. వీడియో
Biceps | పెద్ద బైసెప్స్ కావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఇలా చేయండి..
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

