Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమల లో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల: సెప్టెంబర్ నెలలో తిరుమల ( Tirumala ) లో నిర్వహించే విశేష పర్వదినాల( Special festivals ) వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం, 5న శిక్యోత్సవం, 13న బలరామ జయంతి, వరాహ జయంతి, 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయని వివరించారు.
19న శ్రీవారి గరుడ సేవ, 20న శ్రీవారి స్వర్ణరథం, 22న రథోత్సవం, 23న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం, 24న శ్రీవారి బాగ్ సవారి, అనంత పద్మనాభ వ్రతం, చక్రస్నానం కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల రాకతో మంగళవారం 27 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్వనం అవుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 77,042 మంది భక్తులు దర్శించుకోగా 36,698 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.50 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. 4.14 లక్షల లడ్డూలను విక్రయించగా 2.09 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని తెలిపారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

