Bribe | లంచాలు ఇవ్వడం, తీసుకోవడం నేరం.. లంచాలను ప్రోత్సహించొద్దని, అవినీతికి పాల్పడుతున్న అధికారులను నియంత్రించేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో ఒక చోట అవినీతి బయటపడుతూనే ఉంది. బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు దండుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు. తాజాగా ఓ ఆర్డీవో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
నారాయణపేట ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి 25వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆర్డీవో రాంచంద్ర నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రాంచంద్రనాయక్ ఈ ఏడాది అక్టోబర్ రిటైర్మెంట్ కావాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని లేదా 9440446106 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారి కోరారు.
Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Jailer 2 | ఎట్టకేలకి జైలర్ 2 షూటింగ్ పూర్తి.. రజనీకాంత్ అభిమానుల్లో పెరిగిన అంచనాలు
Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు