మక్తల్, జూన్ 16 : ఈనెల 19వ తేదీ వరకు దోస్త్ పోర్టల్ ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులు మూడో విడత చివరి కౌన్సిలింగ్ కోసం 19వ తేదీ వరకు దోస్త్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు విద్యార్థులకు విద్యాశాఖ అవకాశం కల్పించిందని తెలిపారు.
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించడం సువర్ణ అవకాశంగా భావించి వెంటనే సప్లమెంటరీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 8374374053, 9848983827 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.