మరికల్ : రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి కొత్త చట్టాన్ని తీసుకకొచ్చిందని, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం మరికల్ మండలంలోని తీలేరు, జిన్నారం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. తీలేరు సమావేశంలో ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అధికారులు చేసిన తప్పిదాల వల్ల భూ సమస్యలు ఏర్పడ్డాయన్నారు.
వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందనితెలిపారు. రైతులు అధైర్య పడకుండా భూ సమస్యలను రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రామ్ కోటి, డీటీ బీబీ హజ్రా, గిర్దావర్ సుధాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, రెవిన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు