మాగనూరు జనవరి 25 : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఒక ఆయుధం లాంటిదని తహసీల్దార్ సురేష్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా మాగనూరు తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ ఆవరణం వరకు విద్యార్థులు చేత ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఓటు హక్కు వినియోగంపై అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ బాలరాజ్, హాస్టల్ వార్డెన్ అఫ్జల్ అహ్మద్, సత్యనారాయణ, జిపిఓ లు ఎస్ఆర్ఏలు అంగన్వాడి టీచర్లు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.