నారాయణపేట : రాష్ట్రంలో యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. అయినా ఒక్కా బస్తా దొరకడం కూడా గగనంగా మారింది. తాజాగా యూరియా ఇవ్వడంలేదని మంగళవారం నారాయణపేట అంబేడ్కర్ చౌరస్తాలో రైతులు, అఖిల భారత రైతు ఐక్య సంఘం నేతలు రాస్తారోకో నిర్వహించారు.
పీఏసీఎస్ అధికారులు యూరియా కోసం టోకెన్లు జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాస్తారోకో చేయడంతో మూడు వైపుల ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. వివిధ పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు చౌరస్తా నుంచి నడుచుకుంటూ వెళ్లారు.