Chittem Rammohan reddy | మక్తల్, అక్టోబర్ 06 : త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా తెలియపరచడంతో పాటు ఎన్నికల గ్యారెంటీ కార్డు ప్రకారంగా ప్రజలకు ఇవ్వవలసిన కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలందరికీ చేరువయ్యేలా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
సోమవారం మక్తల్ నియోజకవర్గంలోని నర్వా మండల కేంద్రంలో నర్వ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నర్వ భారత రాష్ట్ర సమితి స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తల కార్యాచరణ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల గ్యారెంటీ కార్డు ప్రకారంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వవలసిన బాకీలన్నింటిని, కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత, ప్రతి భారత రాష్ట్ర సమితి కార్యకర్తపై ఉందని సూచించారు.
ఒక్కొక్క మహిళకు 55 వేల రూపాయలు బాకీ..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో, మహిళలకు నెలకు రూ.2500, 22 నెలల పరిపాలనలో రాష్ట్రంలోని ఒక్కొక్క మహిళకు 55 వేల రూపాయలు బాకీ ఉన్న విధంగా, మహిళామణులందరికీ తెలియపరిచే విధంగా బాకీ కార్డును ప్రతి ఒక్కరికి అందజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలన్నింటినీ అరచేతిలో ఆకాశాన్ని చూపించే విధంగా, రాష్ట్ర ప్రజలకు, పగటి చుక్కలు చూపించి అధికారంలోకి వచ్చిన వెంబడే ఇచ్చిన హామీలను అమలు పరచడంలో, ప్రభుత్వం ఘోరంగా విఫలమైన విషయాన్ని గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలందరికీ కండ్లకు కట్టినట్టుగా చూపించాలన్నారు.
తుగ్లక్ పరిపాలన చేస్తూ మోసం..
రాష్టంలో కాంగ్రెస్ తుగ్లక్ పరిపాలన చేస్తూ, ప్రజందరిని మోసం చేస్తున్న విషయాన్ని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా ముందుకు వెళ్లి, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలే వారి దొంగ హామీలకు గుణపాఠంగా నిలవాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థుల విజయానికి, ఒక సైనికుడిలా పని చేసి, పార్టీ విజయానికి దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు.
కార్యకర్తల సమావేశంలో సింగిల్ విండో చైర్ మెన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు విజయ్, జనార్దన్, శేఖర్, వెంకటయ్య, శివ, నాగరాజు, తిప్పరెడ్డి, చెన్న రెడ్డి తదితరులు ఉన్నారు.
BJP MP | వరద బాధితులకు సాయం చేస్తుండగా దాడి.. ఎంపీకి తీవ్ర గాయాలు
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Gold Prices | బంగారం పరుగులు.. తులం రూ.1.23 లక్షలు