మహబూబ్‌నగర్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తున్నరాని మఖ్తల్ ఎమ్మోల్యే చిట్టెం రాంమెహన్ రెడ్డి అన్నారు. మఖ్తల్ మండలం సత్యారం రైతు వేదికలో సత్యారం, ముష్టిపల్లి, కొండ దొడ్డి గ్రామాలకు చెందిన 71 మందికి నూతన ఆసరా పింఛన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ..కాంగ్రెస్,టీడీపీ పాలనలో వృద్ధులకు పింఛన్లు 200 రూపాయలు మాత్రమే ఇచ్చే వారన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక పదింతలు పెంచి 2016 రూపాయలు ఇస్తున్నారని ఆయన తెలిపారు.
అభివృద్ధిలో తెలంగాణను మేటిగా నిలిపిన ఘన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి పెన్షన్ ఇస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారు దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందజేస్తామన్నారు.