Marikal | మరికల్లో వర్ష బీభత్సం.. నీట మునిగిన కాలనీలు, పంటలు
గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మరికల్ (Marikal) మండలంలో వరి, పత్తి, ఆముదం పంటలు నీట మునిగాయి. మరికల్ మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు చేరి పలు కాలనీలో జలమయమయ్యాయి.
మరికల్, ఆగస్టు 14: గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మరికల్ (Marikal) మండలంలో వరి, పత్తి, ఆముదం పంటలు నీట మునిగాయి. మరికల్ మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు చేరి పలు కాలనీలో జలమయమయ్యాయి. రాయచూర్ ప్రధాన రహదారి ఇరువైపులా కాలనీలలోని ఇళ్ళలకు నీరు చేరింది. పెట్రోల్ బంక్ నీట మునిగింది. ప్రతి ఏడాది భారీ వర్షాలకు అంతర్ రాష్ట్ర రహదారిపై నీరు చేరి కాలనీలు నీట మునుగుతున్న సమయంలో మాత్రమే జిల్లా అధికారులు ఈ ప్రాంతాన్ని పర్యటించి తాత్కాలిక పరిష్కారంతోనే చేతులు దులుపుతున్నారని విమర్శలు ఉన్నాయి.

చెరువుల ఆక్రమణకు గురికావడంతోనే వర్షపు నీరు రోడ్లపై చేరి కాలనీలో జలమయమవుతున్నాయి. ఇబ్రహీంపట్నం, పెద్ద చింతకుంట, బుడ్డగాని తండాలకు వెళ్లే రహదారులు రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పసుపుల ప్రాథమిక పాఠశాలలో నడుములోతు నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులను గ్రామపంచాయతీలో కూర్చోబెట్టి పాఠశాల నడిచే విధంగా చూస్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

