ఊట్కూర్, జనవరి 23 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్ర వేశపెట్టిన ‘కంటి వెలుగు’ ఇంటింటా వెలుగు నింపాలని ఎంపీడీవో కాళప్ప అన్నారు. సోమవారం ఊట్కూర్, పులిమామిడి గ్రామాల్లో చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుం డా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలు, మందు లు అందజేయడంతోపాటు శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
నారాయణపేట మండలంలో…
నారాయణపేట రూరల్, జనవరి 23 : మండలంలోని కోటకొండ, అమ్మిరెడ్డి పల్లి గ్రామాల్లో కంటివెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో సోమవారం 178 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 37 మందికి అద్దాలు అందజేయగా, 39 మందికి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. అలాగే 42 మంది కి జిల్లా దవాఖానకు రెఫర్ చేశారు. కార్యక్రమం లో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదిత రులు పాల్గ్గొన్నారు.
కొనసాగుతున్న ‘కంటివెలుగు’
ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్ర మం కొనసాగుతున్నది. మరికల్, ధన్వాడ మండలాల్లో సోమవారం నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించారు. అంతకుముందు గ్రామాల్లో ఆశ కార్యకర్త లు, వార్డు నెంబర్లు ఇంటింటికీ తిరిగి కంటివెలుగుపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ మండలంలో…
కంటిచూపును అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం సాఫీగా కొనసాగుతుందని కంటివెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ తిరుపతి అన్నారు. పట్టణంలోని 7వ వార్డులో సోమవారం ఏర్పాటు చేసిన శిబిరంలో 130 మందికి గా నూ 111 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మంథన్గౌడ్లో 127 మంది, గుడిగండ్ల పల్లె దవాఖానలో 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కం టి అద్దాలు, మందులు అందజేశారు.
ఆకస్మికంగా తనిఖీ
మండలంలో కొనసాగుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని స్ట్టేట్ క్వాలిటీ కంట్రోలింగ్ ఆఫీసర్ డాక్టర్ సునీత సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వైద్య సి బ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి రాఘవేంద్రరెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.