మాగనూరు అక్టోబర్ 07: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రాటీకు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రానికి చెందిన పలువురు రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎండగట్టి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో ఇటుక బట్టి వ్యాపారి గారేల అశోక్ గౌడ్, రాధికా దంపతులు అలాగే సీనియర్ నాయకులు ఐడిసి మారెప్ప గౌడ్, బింగి తాయప్ప, మంగలి గోపాల్, ఈడికి నవీన్ గౌడ్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పూల రాములు, డిజిల్ సాబేన్న, పల్లె మారెప్ప, సగరం లక్ష్మణ్, వాకిటి రాజు, అడివప్ప, గజపతి, ఏగునురు వెంకటేష్, బుడగ జంగం నారాయణ, కొన్నింటి ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.