నారాయణపేట : జిల్లా కేంద్రంలో రూ. 7 లక్షల విలువ గల గుట్కా డంప్‌ను (Gutka dump) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ వెంకటేశ్వర్లు, టాస్క్ఫోర్సు (Taskforce) సిబ్బందితో కలిసి జిల్లా కేంద్రంలోని సత్యసాయి కాలనీకి చెందిన పూరి శ్రీధర్‌కు చెందిన రేకుల షెడ్డును తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 6,80,460 ఉంటుందని వివరించారు. పూరి శ్రీధర్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచిన, ప్రజలకు అమ్మినా, రవాణా చేసిన అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.