మాగనూరు మే 14 : అక్రమంగా రాత్రి వేళలో ఇసుక డంపులు చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమ్మపల్లి, వడ్వాట్ గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రాత్రి వేళలో అనుమతికి మించి ఇసుక డంపులు చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది బుధవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించి మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.
కాగా, మాగనూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి అక్రమంగా ఇసుక డప్పులు వేస్తున్న విషయం తెలిసిన ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అక్రమ ఇసుక డంపులను సీజ్ చేస్తారా చేయరా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.