Narayanpet | మరికల్: నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు.
వివరాల్లోకి వెళ్తే.. మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన శివరాములును భార్య ఆరేళ్ల క్రితం వదిలిపెట్టింది. భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో ఇద్దరు పిల్లలు రిత్విక (8), చైతన్య(5)ను చంపి కోయిల్ సాగర్ కెనాల్లో మృతదేహాలను పడేశాడు. అనంతరం గ్రామస్తులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. అనంతరం శివరాములు కూడా బలవ్మరణానికి పాల్పడ్డాడు. ముందుగా విద్యుత్ తీగలు పట్టుకుని చనిపోయేందుకు యత్నించి విఫలమయ్యాడు. దీంతో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు శివరాములును మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.