ABVP | మక్తల్, జులై 02 : దేశంలోని ప్రతి విద్యార్థి జాతీయ భావాలు అలవర్చుకొని జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వినయ్ అన్నారు. ఏబీవీపీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా బుధవారం మక్తల్ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో సభ్యత్వం పుస్తకాలకు పూజ నిర్వహించి మక్తల్ నగర అధ్యక్షుడు అంజిరెడ్డితో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు మాట్లాడుతూ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక ఉద్దేశం ఏమిటంటే జాతి పునర్నిర్మాణం, దేశ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురావడం.. దేశంలో ఉన్న ధనవంతుడు పిల్లలు ఎలాంటి విద్యనభ్యసిస్తున్నారో.. చిట్టచివరి విద్యార్థి వరకు అదే విద్యను అందించాలన్నదే ఏబీవీపీ లక్ష్యమన్నారు. యువత జాతీయవాదం వైపు నడవడం, దేశాన్ని విశ్వ గురువుగా చేర్చడంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి విద్యార్థులను బంగారు భవిష్యత్తుగా మార్చే విధంగా ముందుకు సాగాలని సూచించారు.
ప్రతీ విద్యార్థి జాతీయ భావజాలం వైపు రావలసిన పరిస్థితి ఎంతైనా ఉందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు మహేందర్, నవీన్, బాలు, నాని, శివశంకర్, అక్షయ్ కుమార్, అనిల్ కుమార్, వంశీ తదితరులు ఉన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య