బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, ఈ సాంఘిక దురాచారాన్ని అంతం చేసేందుకు ప్రతి ఒకరూ బాధ్యతగా పని చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ వద్ద ష్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సంస్థ రూపొందించిన అవగాహన కరపత్రాలను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి ఆవిషరించారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 17 : బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, ఈ సాంఘిక దురాచారాన్ని అంతం చేసేందుకు ప్రతి ఒకరూ బాధ్యతగా పని చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ వద్ద ష్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సంస్థ రూపొందించిన అవగాహన కరపత్రాలను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి ఆవిషరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చట్ట ప్రకారం వివాహానికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలని స్పష్టం చేశారు.
ఈ వయస్సు కంటే తకువ ఉన్న వారికి పెళ్లి చేయడం నేరమని, ఒకవేళ బాల్య వివాహం చేస్తే తల్లిదండ్రులు, బంధువులతోపాటు దానికి సహకరించిన ప్రతి ఒకరిని నేరస్తులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రచార రథంపై ఏర్పాటు చేసిన సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, జిల్లా సంక్షేమ అధికారి కె.మిలా, జిల్లా అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీశ్ కుమార్, ష్యూర్ ఎన్జీవో జిల్లా కో-ఆర్డినేటర్ వినోద్, సిబ్బంది సంపత్ కిరణ్, సౌజన్య, రామకృష్ణ పాల్గొన్నారు.
యువత భవిష్యత్‌కు విద్యనే ఆయుధం
నార్నూర్, ఫిబ్రవరి 17 : నిరుద్యోగ యు వతి, యువకులు, విద్యార్థుల భవిష్యత్‌కు వి ద్యనే ఆయుధమని ఆదిలాబాద్ కలెక్టర్ రా జర్షి షా అన్నారు. నార్నూర్ మండల కేంద్రంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, గ్రంథాలయ చైర్మన్ మల్లేపూల నర్సయ్యతో కలిసి పర్యటించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ, ఐటీ స్కిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువత, విద్యార్థులు, పాఠకులు వివిధ కోర్సుల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రంథాలయం మంచి అవకాశమన్నారు.
డిజిటల్ యుగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన సిస్టమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కా, నీతి ఆయోగ్ ప్రొగ్రామ్ అధికారి రాహుల్, తహసీల్దార్ జాడి రాజాలింగం, ఎంపీడీవో పూల్లారావ్, ఐటీడీఏ ఈఈ తానాజీ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- adilabad
- Child marriag
- Crime
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

