రాబందుల పాలైన తెలంగాణ
తెలంగాణ దొంగల, రాబందుల పా లైందని, అధికార కాంగ్రెస్ నాయకుల అరాచకాలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. బీజేపీ, కాం గ్రెస్ రెండూ ఒక్కటేనని ఈ ఎన్నికలతో మరోసారి స్పష్టమైందని చెప్పారు. కేంద్రమంత్రి బండి సంజయ్..
- అధికార పార్టీకి తొత్తుగా మారిన ఎన్నికల కమిషన్, పోలీసులు
- మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలో కాంగ్రెస్ అనైతిక చర్యలు
- మోదీ, రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు
- బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దొంగల, రాబందుల పా లైందని, అధికార కాంగ్రెస్ నాయకుల అరాచకాలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. బీజేపీ, కాం గ్రెస్ రెండూ ఒక్కటేనని ఈ ఎన్నికలతో మరోసారి స్పష్టమైందని చెప్పారు. కేంద్రమంత్రి బండి సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రొటెక్షన్ ఇస్తే.. బీజేపీకి రేవంత్‌రెడ్డి ఇస్తున్న ప్రొటెక్షన్ బట్టబయలైందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రె స్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని, బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, ఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ ఫోర్స్‌లా ఒకరికొకరు రక్షణగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు తొక్కుతూ, అరాచకాలకు పాల్పడుతున్నా, ఎన్నికల సంఘం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.
ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర
ఆమనగల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చినా, ఆ పార్టీకి బీజేపీ మద్దతు ఇస్తున్నదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దుయ్యబట్టారు. దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని విమర్శించారు. క్యాతనపల్లిలో బీ ఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా ఆ ము న్సిపాలిటీని కైవసం చేసుకొనేందుకు మంత్రి వివేక్ కుట్ర చేశారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని, మరోవైపు అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారుతున్నారని ఆరోపించారు. జనగామ మున్సిపాలిటీలో దళిత మహిళా స్వతంత్ర అభ్యర్థిపై, కాంగ్రెస్ కౌన్సిలర్ కరుణాకర్‌రెడ్డి దాడి చేయడం హేయమని మండిపడ్డారు. ఈ దాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మౌనం దేనికి సంకేతమని ప్ర శ్నించారు.
ఎంపీ కడియం కావ్య రెండు చోట్ల ఓటు రిజిస్టర్ చేసుకొని తొర్రూరులో ఎక్స్అఫీషియో ఓటు ఎలా వేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ రెండుచోట్ల ఎక్స్అఫీషియో ఓటు రిజిస్టర్ చేసుకున్నారని, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఓటు వేసేలా ప్లాన్ చేసుకున్నారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలోనూ ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయని చెప్పారు. రాజ్యాంగ్యాన్ని అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. జనగామ కౌన్సిల్ ఆఫీస్‌లోకి పోలీసులు వెళ్లడం అక్రమమని పేర్కొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ హల్లోకి పోలీసులు అలాగే వెళ్తారా? అని నిలదీశారు. పోలీసుల ద్వారా రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణలో మరో ఉద్యమం రాబోతున్నదని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో కల్వకుర్తి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

