Teacher | మక్తల్, మార్చి 28 : నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం మోమినపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన దుర్ఘటనలో గోప్యత (ప్రైవసీ) పాటించకుండా విద్యార్థిని వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డిని వెంటనే విధుల నుండి తొలగించి సస్పెండ్ చేయాలని డిటిఎఫ్ నారాయణపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సూర్యచంద్ర, హైమావతి అన్నారు. శనివారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లా విద్యాధికారి కార్యాలయంలో జిల్లా విద్యాధికారిని కలిసి జిల్లా పరిషత్ మేమినాపూర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు గురునాథ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. పాఠశాలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల, ఉపాధ్యాయుల కదలికలను రికార్డు చేసి ఆ రికార్డు చేసిన దృశ్యాలను, ఏ మాత్రం గోప్యత పాటించకుండా రికార్డు చేసిన వీడియో విజువల్స్‌ను, రహస్యంగా ఉంచి, విచారణ అధికారులకు, చైల్డ్ హెల్ప్ లైన్ కు విద్యాశాఖ అధికారులకు పరిమితం చేసి, ప్రభుత్వ ఉపాధ్యాయ స్థానంలో ఉండి చట్టబద్ధంగా ప్రవర్తించకుండా విచ్చలవిడి తనంతో ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసిన ఉపాధ్యాయుడు.. కనీసం విజ్ఞత లేకుండా విద్యార్థి ముఖాన్ని బ్లర్ చేయాలని సోయి కూడా లేకుండా ఒక విద్యార్థిని జీవితాన్ని బజారుకు ఈడ్చాడని.. ఆ ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని డీఈవోకు సూచించడం జరిగిందని తెలిపారు.
పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. అదే పాఠశాలలో వీడియోలను రికార్డ్ చేసి విద్యార్థిని జీవితాన్ని ప్రభావితం చేసిన మరో ఉపాధ్యాయుడిని కూడా కచ్చితంగా సస్పెండ్ చేయాలని వినతిలో పేర్కొనగా, డీఈవో సానుకూలంగా స్పందించి త్వరలోనే కమిటీని ఏర్పాటు చేసి చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
‘పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి’
Mamata Banerjee | బెంగాల్‌ను టార్గెట్ చేస్తే.. కేంద్రంలో బీజేపీని గద్దె దించుతా : మమతాబెనర్జీ
Suicide | వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవి ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య