పంటపొలంలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం.. మాగనూరులో ఘటన
నారాయణపేటజిల్లా మాగనూరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఇండియన్ గ్యాస్ సమీపంలోని ఓ పొలంలో కుళ్లిపోయిన స్థితిలో అతని మృతదేహం లభ్యమైంది.
మాగనూరు మే 05 : నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఇండియన్ గ్యాస్ సమీపంలోని ఓ పొలంలో కుళ్లిపోయిన స్థితిలో అతని మృతదేహం లభ్యమైంది. వరి పంటను కోస్తుండగా హార్వెస్టర్ డ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. శవం పూర్తిగా కుళ్లిపోయిన గుర్తుపట్టనంతగా పాడైనట్లు ఉండటంతో దాదాపు వారం కిందట మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహం పక్కన ఉన్న సెల్ఫోన్ ఆధారంగా చనిపోయిన వ్యక్తిని గుర్తించారు. మాగనూరు మండలం కోల్పూరు గ్రామానికి చెందిన కుర్వ జగలప్ప(48)గా పోలీసులు గుర్తించారు. అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
తన భర్త జగలప్ప ఏప్రిల్ 29వ తేదీన పని మీద రాయచూర్కు వెళ్లినట్లుగా మృతుడి భార్య లింగమ్మ పోలీసులకు తెలిపింది. రాయచూర్కు వెళ్లిన వ్యక్తి పంట పొలంలో ఎలా శవంగా మారాడనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

