ఆత్మకూర్. మంగళవారం రాష్ట్ర శాసనసభలో ఎస్సీ బీసీ బిల్లుల ఆమోదానికి ఆమోదముద్రపడడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రహమతుల్లా పరమేష్ నల్లగొండ శ్రీనివాసులు తులసిరాజ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆత్మకూర్ గాంధీ చౌరస్తాలో ఎస్సీ, బీసీ బిల్లుల ఆమోదానికి ప్రత్యేకంగా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి మళ్ళి భట్టి విక్రమార్క మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహమతుల్లా పరమేశ్వరి మాట్లాడుతూ ఎస్సీ బీసీ వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిల్లుల ఆమోదంతో వాటర్ వేశారని పేర్కొన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అండదండగా నిలిచిందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక శాతం ఎస్సీ బీసీలు రాజకీయ పదవులు పొందేందుకు అవకాశం దక్కిందని ఎందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగొండ శ్రీనివాసులు ఆత్మకూరు మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.